YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డకు వైసీపీ స్ఫెషల్ ధ్యాంక్స్

నిమ్మగడ్డకు వైసీపీ స్ఫెషల్ ధ్యాంక్స్

విజయవాడ, మార్చి 16, 
దాదాపు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు సమీపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ రెండేళ్లలో అధికార వైసిపి పై నిప్పులే చెరుగుతూ వచ్చింది. గత ఏడాది జగన్ సర్కార్ మంచి ఫామ్ లో ఉందనుకున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేసేసారు. దాంతో వైసిపి సర్కార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై న్యాయస్థానాల తో పాటు రాజకీయ యుద్ధమే చేసింది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ బద్ద పదవిలో ఉండటంతో జగన్ సర్కార్ ఎత్తుగడలు సాగలేదు. కట్ చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి జనవరిలో స్థానిక ఎన్నికల నగారా మోగించి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయాక స్థానిక ఎన్నికలు జరుపుకోవాలని భావించిన అధికారపార్టీ ఆయన నిర్ణయంపై సుప్రీం వరకు వెళ్ళి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల నుంచి మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల వరకు చక చకా సాగిపోయాయి. అన్నిటా ఫ్యాన్ స్పీడ్ మామూలు రేంజ్ లో లేదు. దాంతో విపక్షాలకు ఇప్పుడు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేపరిస్థితి ఏర్పడింది. రాజధాని ఉద్యమం తుస్సుమనేలా, ఉక్కు ఉద్యమం సెంటిమెంట్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు అన్ని గల్లంతు అయిపోయాయి. వీటితో పాటు టిడిపి, జనసేన, బిజెపి కలిసినా చెక్కుచెదరని జగన్ ఓటు బ్యాంక్ కోటను కొల్లగొట్టలేదని మరోసారి తేలిపోయింది.  ఇంతటి ఘన విజయానికి మూల కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి ఎన్నికలు జరపడమే అన్న సత్యం ఇప్పటికైనా ఫ్యాన్ పార్టీ గ్రహించి ఆయనకు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పక తప్పదు మరి. అయితే ఈ ఫలితాల తరువాత ఇటు అధికారపార్టీ కానీ అటు విపక్షాలు ఆయన ఊసే ఎత్తకపోవడం గమనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం ఎంపిటిసి, జెడ్పి ఎన్నికలకు సాహసించకుండా సెలవుపై కొద్దిరోజులు వెళ్లడం కొసమెరుపు కానుంది.

Related Posts