సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఇంట్లో అయినా 7 రంగులు కలిసిన వాల్మెట్ తెచ్చి గోడకు తగిలించండి అలాగే గోడ గడియారం తూర్పు వైపున ఉండేలా చూడండి ఆగిపోయిన గోడ గడియారాలు అలా ఉంచకూడదు వెంటనే సెల్స్ వేయాలి.
చినిగిన వస్త్రాలు మూట కట్టి ఆటక పైన దాచి పెడతారు ఆ ఇంట్లో ధనం నిలవడం కష్టం వచ్చే ధనానికి తగిన ఖర్చులు ముందే వచ్చి కూర్చింటుంది ఇవన్నీ చాదస్తం గా అనుకున్న అవి శుభ్రంగా ఉంచడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది అలా ఆలోచించి అయినా జాగర్త పడాలి.
డబ్బు నగలు ఉంచే బీరువాకి అద్దం. ఉండకూడదు అందులో చూసుకుని తల దువ్వ కూడదు , ఒక్కసారి అరగంట కట్టిన చీరె కదా అని అవి మళ్ళీ విడిచిన తర్వాత ఉతకకుండా మడిచి బీరువాలో పెడుతుంటారు ధనము దాచే బీరువాలో ఉంచకుండా విడిగా పెట్టుకుంటే మంచిది అలా విడిచిన బట్టలు ఉతకకుండా ధనము ,నగలు పెట్టె బీరువాలో ఖరీదైన వే అయిన విడిచినవి ఉతకాకుండా పెడితే ఆస్తులు అమ్ముకుని తింటారు అంతా మంచులా కరిగిపోతుంది..
వారానికి ఒక్క సారి అయిన శుక్రవారం రోజు గడపకు పసుపుకుంకుమ రాసి పూలు పెట్టాలి ఎంత పేద కుటుంబం అయినా నిత్య అవసరాలకు లోటు ఉండదు. భర్త భోజనం చేసి టప్పుడు తిట్టకూడదు అరవకూడదు అసహ్యించుకుంటూ కరుసుతు వడ్డించ కూడదు తిన్నాక మాట్లాడాలి అర్ధాకలితో భర్త కంచం నుండి లెవకూడదు. అలాగే వంట రుచిగా లేకపోయినా తింటున్న సమయంలో విమర్శించకూడదు వడ్డించే టప్పుడు భార్యని నిందిస్తూ తిట్టకూడదు. మీకు సంబంధం లేని వ్యక్తులు వ్యక్తిగత విషయాలు చెడు విషయాలు చర్చించకూడదు నిందలు వేయకూడదు, మనము గొప్ప అనిపించుకోవడానికి తప్పుగా ఎవరి పైన చాడీలు చెప్పకూడదు.
పరుషమైన మాటలతో ఎవరిని వేదించకూడదు. భార్య అందం పరాయి వారి ముందు పొగడ కూడదు భార్య లోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు, అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించ రాదు ఇంట్లో భార్య మాటలు వినాలి బయట భర్తమాట నెగ్గాలి ఇతరుల ముందు భార్యాభర్తల ఒక్కమాట గా ఉండాలి ఇతరులు మీ మధ్య కలగచేసుకుని పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు భార్య భర్తలు రెండు దేహాలుగా ఉంటే ఒకటే ప్రాణం అని నమ్మాలి ఎవరో ఒకరికి అవమానం జరిగితే ఇంకొకరికి జరిగినట్టే ఇంటి గుట్టు బయటకు రాకూడదు భర్త యొక్క గౌరవం భార్య ప్రవర్తన లో ఉంటుంది, ఇది వరకు కాలంలో పిల్లలు ముందు పెద్దలు మాట్లాడుకునే వారు కాదు ఇప్పుడు అన్ని విషయాలు వారి ముందే చర్చించడం వల్ల పిల్లలకు చులకన అయిపోతున్నారు.. వారి ముందు ఎప్పుడూ పెద్దమనుషులు లాగానే ఉండాలి..
బయట వారితో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయం తీసుకోకూడదు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. భార్య తెలివి లేనిది అనుకోకూడదు తెలివి లేనిది అయినా మీ మంచి కోరే వ్యక్తి మీకు మంచే చెపుతుంది.
భార్య సంపాదిస్తున్నా భార్తకు తెలియకుండా నిర్ణయం తీసుకోకూడదు సమస్య వస్తే అండగా నిలబడేది కుటుంబమే .ఆర్ధిక స్వేచ్ఛ సమాజంలో ఉన్నత స్థితికి చేర్చాలి కానీ కుటుంబం విడిపోయే పరిస్థితి రాకూడదు..
తల్లిదండ్రులను నీకు ఏమి తెలియదు అని అనకూడదు వారు చూడని ప్రపంచం కాదు ఇది ఏదైనా చెప్పినా అది వినడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఆ మాటలు మనకు ఉపయోగ పడుతుంది నిజమే అనిపిస్తుంది.
మంచి ఎవరు చెప్పినా వినాలి మనకు మంచిది అనిపించినదే చేయాలి. వాదనలు వల్ల బంధాలు బలహీనంగా మారుతుంది మూర్కుల తో వాదన తల గోడకు కొట్టుకోవడం ఒక్కటే.
చిన్న చిన్న జాగర్తలు వల్ల కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మంచి భవిష్యత్తు మంచి ఆలోచన మీ పిల్లలకు ఇవ్వడం ముఖ్యం .తల్లిదండ్రులు విలువ తెలిసేలా పిల్లలను పెంచాలి.
గొప్పకోసం అప్పులు చేయాకుడదు స్తోమతకు మించి ఖర్చు చేయాకుడదు..
అహంకారం ఇగో మనిషికి మొదటి శత్రువులు.. ఇటువంటి చిన్న చిన్న జగర్తలు తీసుకోలేని వారు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా ఫలితం ఉండదు...
వారి నొప్పిని మీరు ఎలా తీసుకోలేరో అలాగే వారి దోషాన్ని మీరు తీసుకోలేరు..
ధానం ధర్మ గుణం వల్ల కర్మని వదిలించుకునే అవకాశం వస్తుంది, పశ్చాత్తాపం వల్ల పాపానికి ప్రాయశ్చిత్తం లభిస్తుంది కానీ కర్మని తప్పించుకోలేరు ఎవరు, కర్మ భూమిలో జన్మిస్తే దేవుడైన కర్మానుసారం బతకాలి కర్మను ఆచరించాలి..
ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో తల కిందులుగా వేలాడుతూ వైతరిని నదియొక్క దుర్వాసన భరించ లేక గతజన్మ పాప కర్మలను గుర్తు చేసుకుంటూ కలగబోయే జన్మలో పుణ్యకార్యలు చేయాలి అని దైవాన్ని ప్రార్థిస్తూ మళ్ళీ జన్మవద్దు ఈ బాధ వద్దు అని 9 నెలలు ప్రార్థనచేస్తూ మాతృ స్తానం నుండి లోకానికి వచ్చిన జన్మతః సూద్రులమే తల్లి ప్రసవ వేదనతో పుట్టుని వారమే తల్లి కక్కితే నోటి నుండి పుట్టిన వారు ఎవరూ లేరు మల మూత్రాలతో 9 నెలలు మైలు రుదిరంతో వచ్చిన వారమే , సాధనతో జన్మ తరించాలి కానీ పుట్టుకతో బ్రహ్మ ఎవరూ కారు ఎవరూ లేరు.
ఎలా వచ్చాము కర్మను వెంట బెట్టుకుని వచ్చాము ఎలా వెళ్ళాలి కర్మను తీర్చుకుని వెళ్ళాలి అనుభవిస్తున్న ప్రతిదీ కర్మను తీర్చుకుంటున్నాము అని ఆమోదించాలి ధూరమైన ప్రతిదీ ఋణం తీరిపోయింది అనుకోవాలి అందరూ ఒకరోజుకి దూరం కావాల్సిన వారే అందరికి ఒకరోజు మనమూ దూరం కావాల్సిన వారమే .
జరిగిపోయే ప్రతి రోజు కాలం విలువను గుర్తు చేస్తూ ఉండాలి జీవితంలో కొన్ని గంటలు ఎలా గడుపుతున్నాము గుర్తు చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవచ్చు కానీ గడిచిపోయినా కాలం ఎప్పటికీ తిరిగి రాదు అంటే అన్నింటికన్నా కాలం విలువైనది..
నీదగ్గర ఉన్న ధనమంతా ఖర్చు చేసిన ఒక్క నిముషం ఆయువుని కొనలేవు అంటే ధనము కోసం పడిన పాట్లు అంతా నీ ప్రాణము కన్నా విలువైనది కాదు అన్నిటి కన్నా విలువైనది నీ జీవితం జీవిత కాలం.
శాశ్వత మైన ది ఆధ్యాత్మిక సంపద ఒక్కటే.. ఒక్క యోగులు సిద్ధులు అవధూతలు మటుకే కొన్ని యుగాలు బతికారు ఋషులు యొక్క మరణం ఇంత వరకు జరగలేదు దేవుడి అవతారం కూడా ముగించిన సమయం తెలుసు ఋషులు మరణించి నట్టు ఎక్కడైనా ఆధారం ఉందా..
నవరంద్రాలు మూసి చర్మ చక్చువులతో గాలిని భుజిస్తూ కొన్ని యుగాలుగా జీవిస్తున్న మునులు ఇంకా ఉన్నారు.. ధనం కొనలేని ఆయువుని ఎవరు వీరికి ఇచ్చారు మరణాన్ని ఎలా జెయించారు హఠయోగం, అష్టంగయోగం ధ్యానం , మంత్రం దేవతయొక్క సూక్ష్మ దేహం అది మానవ దేహంలో లయం ఐపోయే విధంగా ధ్యానం చేయాలి ఏ మంత్రాధిష్ఠదేవతను ద్యానిస్తున్నామో ఆ రూపంలోకి సాధన ద్వారా మారిపోవాలి ఇది ఒక్క సమాధి స్థితిని ధ్యానంలో పొందేలా సాధన చేస్తే నే సాధ్యం అవుతుంది.
బ్రహ్మచర్య దీక్ష అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది గృస్థులు కూడా కొన్ని నియమాలను పాటిస్తూ సాధన చేస్తే బ్రహ్మచర్యం పాటించిన వారు అవుతారు..
మీకు అష్టంగా యోగం గురించి చెప్పి నప్పుడు గృహస్థు ధర్మాలు కూడా వివరిస్తే కొన్ని నియమాలతో ఆ శక్తిని ఎలా పొందాలో అర్తం అవుతుంది.
చిన్న చిన్న విషయాలకు ఆలోచనలతో మొదలు ఐయ్యే అలజడి కుటుంబ వ్యవస్థని చిన్నా బిన్నం చేస్తుంది ఇలా బతకడం కాదు జీవితం మీరు భగవంతుడు సృష్టిలో ఒక అద్భుతం మీ జీవితం అద్భుతం మీరు అత్యంత సమర్థులు మీ యొక్క విలువ మీరు తెలుసుకోవాలి జీవితంలో ప్రతి నిముషం మీకు విలువైనది దాన్ని సద్వినియోగం చెలుకోవాలి. గొడవలతో అనవసరమైన మాటలతో మీ విలువైన సమయం వృధా చేసుకోకండి.. ఇవన్నీ చెప్పడం సులబమే ఆచరించడం సాధ్యమా అనుకోవచ్చు ,ప్రతి తప్పని క్షమించండి అలవాటు చేసుకోండి.
Curtesy: అవధానుల శ్రీనివాస శాస్త్రి