YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో వర్గపోరు

వైసీపీలో వర్గపోరు

 రగడ సృష్టిస్తోన్న  నాయకుల సస్పెన్షన్‌  వర్గపోరు

కావలి నియోజకవర్గంలో నలుగురు వైసీపీ నాయకుల సస్పెన్షన్‌ పెద్ద రగడ సృష్టిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో విష్ణు వర్గీయులు నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం పెద్ద దుమారం రేపుతోంది. గత ఏడాది నియోజకవర్గ సమావేశంలో విష్ణు వర్గీయులు రామిరెడ్డిని వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. అప్పుడే ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈసారి వైసీపీ ఎమ్మెల్యేగా రామిరెడ్డే పోటీ చేస్తారని ప్రకటించడం విష్ణు వర్గీయులు ఎంపీపై విమర్శలు గుప్పిస్తూ అల్లూరు మండల కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డితో వాగ్వివాదం చో టు చేసుకుంది. ఇది మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే విష్ణు వర్గీయులైన అల్లూరుకు చెందిన బాలకృష్ణమరాజు, వై.శేఖర్‌రెడ్డి, టీ.సుధాకర్‌, అశోక్‌కుమార్‌రెడ్డిల ను పార్టీ నుంచి సాగనంపాలని ఆలోచన చేశారు.

గత ఏడాది డిసెంబరు 7న రామిరెడ్డి అల్లూరు మండల కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డి లేఖ మేరకు రీజనల్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామిరెడ్డికి ఎమ్మెల్యే లేఖ రాసి ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. ఈ నెల 3న జిల్లా కన్వీనర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరిట షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, ఆ నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే రామిరెడ్డి సూచనల మేరకు ఈ నోటీసులు జారీ చేశామని కాకాణి పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న ఆ నలుగురు ఎమ్మెల్యే, మండల కన్వీనర్‌ ఏం సిఫార్సులు చేశారో వెల్లడించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

జనవరి 1న అల్లూరు మండల వైసీపీ కన్వీనర్‌ దండా కృష్ణారెడ్డి, వైసీపీ నేత ఆళ్ల సుధాకర్‌రెడ్డిలు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను కలిసి అభినందనలు తెలిపారని విష్ణు వర్గీయులు వెల్లడిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరులుగా ఉంటూ, మరోవైపు బీదతో సఖ్యతగా ఉంటూ రూ.10 కోట్ల వర్కులు చేస్తున్నారని ఆరోపించారు. అలా రహస్యంగా కలిసి అభినందనలు తెలిపిన వారిని వదిలి పార్టీ కోసం పని చేస్తున్న తమను పార్టీ నుంచి సాగనంపడం ఏమిటని ఇటీవల జగన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాదు.. బీదను కలిసిన ఫోటోలు, షోకాజ్‌ నోటీసులు జగన్‌కు అందించారు. ‘‘తాను జిల్లాకు వస్తున్నానని, అప్పుడే దీనిపై మాట్లాడతా’’నంటూ జగన్‌ హామీ ఇచ్చినట్లు విష్ణు వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జిల్లాకు రానున్న జగన్‌ కావలి రగడను ఎలా పరిష్కరిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts