YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రెండవ రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల అందోళన మద్దతు తెలిపిన ఎల్ఐసీ ఉద్యోగులు

రెండవ రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల అందోళన మద్దతు తెలిపిన ఎల్ఐసీ ఉద్యోగులు

నూజివీడు మార్చ్ 16 
కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ వద్ద రెండో రోజు ఆందోళనకు ఎల్ఐసి ఉద్యోగులు మద్దతు తెలిపారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలి అని డిమాండ్ చేసారు. పట్టణంలోని ప్రజలకు బ్యాంకుల ప్రైవేటీకరణను వల్ల జరిగే నష్టాలను వివరించే  పాంప్లెట్లు పంపిణీ చేసారు. రాబోయే తరాలకు ఉద్యోగాలు ఉద్యోగ భద్రత ఉండదు,బ్యాంకులో డిపాజిట్లకు బరోసా ఉండదు,రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుంది. ఉచితంగా అందించే సేవలు అంతరించి పోతాయి,ఇతర సేవల మీద పన్ను భారం పెరుగుతుంది, కనీస కాతా నిల్వలు కూడా భారీగా పెరిగి పోతాయని వారు అన్నారు. ఆన్లైన్ సేవలపై ప్రత్యేక వడ్డింపులు ఉంటాయి, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలు అవుతాయి,కొన్ని బ్యాంకులు బ్రాంచీలు కూడా మోసపోయిన పడతాయి. గతంలో దివాలా తీసిన ప్రైవేటు బ్యాంకులకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.

Related Posts