హైదరాబాద్ మార్చ్ 16
మంగళవారం ఉదయం మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అయనను ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్బంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నేను పుట్టింది పెరిగింది, నా ఉన్నతికి కారణం కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసి చాలా బాధేస్తుందని అన్నారు. మీరు కేసీఆర్ ను ఓడించలేరని అన్న జేసీ, నేను సీఎం నేను సీఎం అంటూ పార్టీని నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నేను మాత్రం సీఎం అనలేదని జీవన్ రెడ్డి అన్నారు. ముందు రాహుల్ గాంధీకి పెళ్లి చేయాలని మేడమ్ కు చెప్పానని జేసీ అన్నారు. అయనను కాంగ్రెస్ లోకి రావాలని భట్టీ కోరారు. అయితే పార్టీకి కాలం చెల్లిందని జేసీ బదులిచ్చారు. నేను బతకాలి కదా కాంగ్రెస్ లో బతికే ఛాన్స్ లేదని అన్నారు.
ఇంతలో అక్కడి వచ్చిన ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా భవిష్యత్ ఏంటని అడిగారు. కాంగ్రెస్ లో భవిష్యత్ లేదన్న జేసీ సమాధానమిచ్చారు. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నాను అని రాజగోపాల్ రెడ్డి చెబుతుండగా అయన ను చెప్పకుండా భట్టి అపివేసారు. ఇప్పుడు యుద్ధం చేయాలి కానీ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదని రాజగోపాల్ రెడ్డి అనడంతో కొత్త మార్గాలు చూసుకోవాలన్న జేసీ సూచించారు