మచిలీపట్నం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు ఇచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అమరావతి రాజధాని విషయంలో గందరగోళం సృష్టించేలా వ్యవహారిస్తున్నారని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 నెలలు అవుతుంది మరి ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు.మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి నారాయ ణ అసైన్డ్ ల్యాండ్ ను బదాలయించా రంటూ ఆరోపిస్తున్నారని,ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతికి మద్దతు ఇచ్చిన సంగతి మర్చిపో యారా అని నిలదీశారు.విశాఖలో రాజధాని కావాలని వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారని, ప్రతిపక్షాల పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.