YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పై హైకోర్టు కీలక తీర్పు

ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పై  హైకోర్టు కీలక తీర్పు

అమరావతి మార్చ్ 16
ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలకు రంగం సమాయత్తం అవుతున్న వేళ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు గట్టి షాక్ తగిలింది. గత ఏడాది ఈ ఎన్నికలకు సంబంధించిన నోటీఫికేషన్ ఇచ్చారు ఎస్ఈసీ. అయితే నోటిఫికేషన్ తర్వాత అనేక చోట్ల ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయని.. వీటిని ఆమోదించవద్దని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వీటిపై వైసీపీ నేతలు కోర్టుకు ఎక్కారు.తాజాగా నిమ్మగడ్డ విధించిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.ఎస్ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. గత ఏడాది నిలిచిపోయిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణ అధికారం ఎస్ఈసీకి లేదన్న పిటీషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు నిమ్మగడ్డకు ఆదేశాల్చింది.

Related Posts