న్యూ డిల్లీ మార్చ్ 16 ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కే వార్నింగ్ ఇస్తోంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్. మీకు నిద్ర లేకుండా చేసుకునే చర్యలు దిగొద్దని ఆమె హెచ్చరించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది. అధ్యక్షడు కిమ్‌కు ఆమె కీలకమైన సలహాదారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన సుమారు రెండు నెలల తర్వాత తొలిసారి ఆమె ఇలా అధ్యక్షుడికే హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన జారీ చేసింది. మీరు వచ్చే నాలుగేళ్లు హాయిగా నిద్రపోవాలని అనుకుంటే మళ్లీ మొదటి నుంచీ పని మొదలుపెట్టకండి. దాని వల్ల మీకు నిద్ర కోల్పోతారు అని ఆమె చెప్పింది. బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమెరికా తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఆ తర్వాత మిలిటరీ పరేడ్‌లో భాగంగా సబ్‌మెరైన్ లాంచ్ చేసే బాలిస్టిక్ మిస్సైల్‌ను లాంచ్ చేసింది.అమెరికాకు చెందిన పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియా పర్యటనలను సోమవారం ప్రారంభించిన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. వీళ్లకు ఇదే తొలి విదేశీ పర్యటన. చైనాకు, అణ్వాయుధ సంపత్తి ఉన్న ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా కూటమి కట్టడం కోసం అమెరికా ఈ కీలక పర్యటనలు చేపడుతోంది. గత వారంలో సౌత్ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త మిలిటరీ కసరత్తులు చేపట్టింది. దీనిపై స్పందించిన నార్త్ కొరియా.. తమ భూభాగంలో గన్‌పౌడర్ వాసనను విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా కొత్త పాలకవర్గానికి ఒక సూచన అంటూ ఈ హెచ్చరికను జారీ చేసింది.