YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అక్టోబరులో చంద్రయాన్ కు ఇస్రో ప్లాన్

అక్టోబరులో చంద్రయాన్ కు ఇస్రో ప్లాన్

తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేపట్టిన ఇస్రో, అంతరిక్షంలో అద్భుతాలను సృష్టిస్తోంది. ఇటీవల కొన్ని ప్రయోగాలు విఫలమైనా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 12 న పీఎస్‌ఎల్వీ -సీ41 రాకెట్ ద్వారా దేశీయ నేవిగేషన్ వ్యవస్థ కోసం రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉపగ్రహా ప్రయోగం విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సహాంతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-2 మిషన్ ప్రయోగం కూడా అక్టోబరులో ఉంటుంది. ఇస్రో ప్రయోగించబోయే వాటిలో సైనిక అవసరాలకు ఉపయోగపడే ఉపగ్రహాలే అధికంగా ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దులు, ప్రాదేశిక జలాల్లో శత్రుదేశాల కదలికలపై నిఘాకు, భద్రతకు ఉపయోగపడేలా ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. భారత వాయుసేనకు ఉపకరించే జీశాట్- 7ఎ ఉపగ్రహాన్ని సెప్టెంబరులో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఆధునిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిట్‌శాట్- 2ఎను సైతం ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగించనుంది. జీశాట్- 7 ఎను జీఎస్‌ఎల్వీ ఎంకే- 2 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహంతో వాయుసేనకు చెందిన రాడార్ స్టేషన్లు, వైమానిక స్థావరాలు, యుద్ధ విమానాలను అనుసంధానం చేస్తారు. దీని వల్ల కీలక సమయంలో వైమానిక దళ యుద్ధ సామర్థ్యం పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది. నౌకాదళ సేవల కోసం 2013 సెప్టెంబరు 29 న ప్రయోగించిన జీశాట్- ఎ లేదా రుక్మిణి మాదిరిగానే ఇది వాయుసేనకు సేవలందించనుంది. రుక్మిణ ఉపగ్రహం హిందూ మహా సముద్రంలో సుమారు 2,000 నాటికల్ మైళ్ల దూరంలోని శత్రువుల కదలికలపై సమాచారం అందిస్తుంది.రిట్ శాట్- 2 ఏను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం వల్ల దేశంలో నిఘా సామర్థ్యం మరింత పటిష్టమవుతుంది. ఇందులోని 5.35 గిగాహెర్జ్‌ల సామర్థ్యంతో పనిచేసే అధునాతన సింథటిక్ రాడార్ వ్యవస్థ వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లోనూ సమాచారాన్ని అందిస్తుంది. రిట్‌శాట్‌ను పౌర అవసరాల కోసం ప్రయోగిస్తున్నా, ప్రధానంగా భూ ఉపరితల మ్యాపింగ్ కోసం వినియోగిస్తారు. అంతేకాదు సముద్ర ఉపరితల విశ్లేషణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఇక మిలటరీ అవసరాల కోసం జీశాట్-11 ఉపగ్రహాన్ని జూన్‌లో ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించనుంది. అలాగే జీశాట్-29 కూడా జీఎస్ఎల్వీ ఎంకే 3 ద్వారా జూన్‌లో అంతరిక్షంలోకి పంపనుంది.

Related Posts