YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీతో రాబిన్ శర్మ....

టీడీపీతో రాబిన్ శర్మ....

విజయవాడ, మార్చి 17, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన గతంలో ఎన్నడూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనలేదు. చూడలేదు కూడా. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఆయన దానిని దీటుగా ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు పార్టీని నిలబెట్టుకోగలిగారు. సొంత వ్యూహాలతో 2014లో తిరిగి అధికారంలోకి తీసుకురాగలిగారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.అందుకే వ్యూహాల కోసం రాబిన్ శర్మను చంద్రబాబు నియమించుకున్నారు. తొలుత తిరుపతి ఉప ఎన్నిక కోసం రాబిన్ శర్మను నియమించారు. ఆయనను వచ్చే సాధారణ ఎన్నికల వరకూ కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే రాబిన్ శర్మ ఇస్తున్న సలహాలు వర్క్ అవుట్ కావడం లేదంటున్నారు. తొలుత రామతీర్థం ఘటనకు చంద్రబాబు నేరుగా వెళ్లాలని కూడా రాబిన్ శర్మ సూచించడంతోనే వెళ్లారట.అయితే దానివల్ల కొన్ని సామాజికవర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయని చంద్రబాబు భావిస్తున్నారు. మైనారిటీలు, క్రైస్తవ సామాజికవర్గాలు ఆ ఘటనతోనే టీడీపీకి మరింత గ్యాప్ పెరిగిందని తెలియడంతో రాబిన్ శర్మ వ్యూహాలపై చంద్రబాబుకు అనుమానం వచ్చిందంటున్నారు. ఇక తిరుపతి ఘటన కూడా రాబిన్ శర్మ వ్యూహంలో భాగమేనట. తిరుపతి ఎయిర్ పోర్టులో 9 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టి జాతీయ మీడియాను ఆకర్షించగలిగినా రాష్ట్ర స్థాయిలో పెద్దగా మైలేజీ రాలేదని చంద్రబాబు భావిస్తున్నారు.దీంతో సీనియర్ నేతలు సయితం రాబిన్ శర్మ వ్యూహాలను తప్పుపడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎదుట చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు రాబిన్ శర్మను నమ్ముకుంటే పుట్టి మునగడం ఖాయమని సూచించడంతో రాబిన్ శర్మ విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక వరకూ ఆయనను కొనసాగించి ఆ తర్వాత ఆయనకు గుడ్ బై చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. మొత్తం మీద రాబిన్ శర్మకు, చంద్రబాబుకు మధ్య డీల్ ఒక ఉప ఎన్నికకు మాత్రమే పరిమితమయింది

Related Posts