YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారత్...మిలియనీర్ల అడ్డా

భారత్...మిలియనీర్ల అడ్డా

న్యూఢిల్లీ, మార్చి 17, 
దేశంలో పేదరికం వెక్కిరిస్తున్నా మిలియనీర్ల సంఖ్యలో మాత్రం భారత్‌ వెలిగిపోతోంది. దేశంలో 4.12 లక్షల డాలర్‌ మిలియనీర్ల (రూ 7 కోట్ల సంపద) కుటుంబాలున్నాయని హురున్‌ ఇండియా సంపద నివేదిక 2020 వెల్లడించింది. ఈ జాబితాలో ముంబై టాప్‌లో నిలవగా ఢిల్లీ రెండో స్ధానంలో ఉంది. ఈ మిలియనీర్లు తమ రాబడిని షేర్లు, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకే వీరు మొగ్గు చూపుతున్నారని నివేదిక తెలిపింది. రూ 7 కోట్లపైబడిన కనీస సంపద కలిగిన డాలర్‌ మిలియనీర్‌ కుటుంబాలు భారత్‌లో 4,12,000 వరకూ ఉన్నాయని వెల్లడించింది. హురున్‌ రిచ్‌ జాబితాలో తొలి పది ర్యాంకుల్లో ఉన్న రాష్ట్రాల్లోనే 70.3 శాతం మిలియనీర్లు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 56,000 మంది మిలియనీర్లు ఉండగా యూపీలో 36,000 తమిళనాడులో 35,000 కర్ణాటకలో 33,000 గుజరాత్‌లో 29,000 మంది మిలియనీర్లు ఉన్నారు.దేశ ఆర్థిక రాజధాని, దేశ జీడీపికి 6.16 శాతం సమకూర్చే ముంబై నగరంలో ఏకంగా 16,933 మంది మిలియనీర్‌ కుటుంబాలున్నాయి. ఇక న్యూఢిల్లీలో 16,000 మంది మిలియనీర్లు ఉండగా కోల్‌కతాలో 10,000 మంది మిలియనీర్లు కొలువుతీరారని ఈ నివేదిక వెల్లడించింది. ఇక భారత మిలియనీర్లలో అత్యధికులు లగ్జరీ కార్‌ బ్రాండ్‌గా మెర్సిడెస్‌ బెంజ్‌ వైపు చూస్తుండా ఆ తర్వాత బీఎండబ్ల్యూ, జాగ్వర్‌లు నిలిచాయి. మరోవైపు లగ్జరీ స్పోర్ట్స్‌ కార్లలో మిలియనీర్లు ముందుగా లంబోర్గినికి ఓటేస్తుండగా, పోర్షే, ఆస్టన్‌ మార్టిన్‌ ఆ తర్వాతి స్ధానాల్లో నిలిచాయని హురున్‌ ఇండియా లగ్జరీ కన్జూమర్‌ సర్వే వెల్లడించింది. ఇక మిలియనీర్లకు ఇష్టమైన జ్యూవెలరీ బ్రాండ్‌గా తనిష్క్‌ ముందువరసలో నిలిచింది. తాజ్‌ గ్రూప్‌ హోటళ్లు ఆతిథ్య విభాగంలో

Related Posts