YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

షైనింగ్ ఇండియా

షైనింగ్ ఇండియా

భారత్ మొదటి ఆరు నెలల్లో సగటు జి.డి.పి వృద్ధి 7.8 శాతానికి పెరగగలదని జపాన్ ఫైనాన్షియల్ సర్వీసుల అగ్ర సంస్థ నొముర  పేర్కొంది. నికర ఎగుమతులు క్షీణిస్తున్న సమయంలో పెట్టుబడి, వినిమయ డిమాండ్ భారతదేశ వృద్ధికి కారణమని తెలిపింది. ‘ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం 2017 ద్వితీయార్థంలోనే మొదలైంది. అది 2018 మొదటి ఆరు నెలల్లో కొనసాగనుంది’’ అని నొముర ఒక పరిశోధన పత్రంలో పేర్కొంది. ఈ డాటాను బట్టి ‘‘సగటు జి.డి.పి వృద్ధి 2017 అక్టోబరు-డిసెంబరులో ఉన్న 7.2 శాతం నుంచి 2018 మొదటి ఆరు నెలల్లో 7.8 శాతానికి పెరగగలదని మేం అంచనా వేస్తున్నాం’’ అని ఆ సంస్థ తెలిపింది.పెరుగుతున్న చమరు ధరలు, నగదు సరఫరాను పరిమితం చేస్తున్న ఆర్థిక పరిస్థితులు, ఎన్నికలకు ముందు పెట్టుబడి కార్యకలాపాలలో చోటుచేసుకునేందుకు అవకాశమున్న మందగతి కలసి ఈ ఏడాది ద్వితీయార్థంలో వృద్ధి మితంగానే ప్రారంభమవుతుందని సూచిస్తున్నాయి.2017-18లో 6.6 శాతంగా ఉన్న భారతదేశపు ఆర్థిక వృద్ధి రేటు, పెట్టుబడి కార్యకలాపాలలో పునరుద్ధరణ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి పటిష్టపడగలదని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. పెరుగుతున్న చమురు ధరలు స్థూల గతిశీల అంశాలను మార్చివేస్తున్నాయి. అవి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తేవచ్చని ఆర్.బి.ఐ భావించడంలో తప్పు లేదని దాని ద్రవ్య విధాన వైఖరిపై నివేదిక వ్యాఖ్యానించింది. పీపా ముడి చమురు ధరలో వచ్చే ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు, వినియోగదార్ల ధరల సూచి ద్రవ్యోల్బణం 30 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ లోటు 0.4 శాతం పాయింట్లు పెరగవచ్చని నొముర పేర్కొంది. ‘‘చమురు ధరలు ఈ స్థాయిల్లోనే ఉంటే, ద్రవ్య విధానం మరింత కట్టుదిట్టమై నగదు సరఫరా తగ్గవచ్చు లేదా మా ప్రాథమిక వాదనకు తగ్గట్లుగా ఏ మార్పూ లేకుండా ఉండవచ్చు’’ అని నివేదిక వెల్లడించింది. 

Related Posts