YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేబినెట్ విస్తరణ...?

కేబినెట్ విస్తరణ...?

హైదరాబాద్, మార్చి 17, 
తెలంగాణలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా మంత్రివర్గంలోకి వచ్చే వారి విషయంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్పష్టత రావచ్చును. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కూడా కొన్ని మార్పులు చేయడానికి సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తే ఆయనను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సురభీ వాణీ విజయం సాధిస్తే ఆమెను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు సీఎం ఒక మహిళా మంత్రి ని పక్కకు తప్పించి ఆలోచనలో ఉన్నారని ఆమె స్థానంలో కవితను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ వర్గాలంటున్నాయి.2018 తర్వాత కేబినెట్ లోకి వచ్చిన మహిళా మంత్రి విషయంలో సీఎం కేసీఆర్ కాస్త అసహనంగా ఉన్నారని కూడా సమాచారం. ఇక ఒకవేళ ఆమె తప్పుకోకపోతే మరో మంత్రిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే కవిత మాత్రం కచ్చితంగాక్యాబినెట్ లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ మార్పుచేర్పులు ఎప్పుడు జరుగుతాయో మరి.

Related Posts