హైద్రాబాద్, మార్చి 17,
తెలంగాణాలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న వైఎస్ షర్మిల కసరత్తులు చేస్తున్నారు. పలువురు కీలక నేతలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ నేతలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమెను ఉద్దేశించి టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల ప్రస్తుతం వామప్ చేస్తోంది అని అన్నారు. ఏడాదిన్నరలో ఏపీకి కూడా ఎంటర్ అవుతుంది అని అన్నారు.విజయమ్మకు షర్మిల మీదనే ప్రేమ ఎక్కువ అని పేర్కొన్నారు. షర్మిల కు ఏదైనా కీలక పదవిస్తే సమస్య సమసిపోయేది అని అన్నారు. మోడీ కి మా మద్దతు లేకుండా ఏపీలోఒక్క సీటు కూడా రాదు అన్నారు. ఇక నేడు ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటు,విధి విధానాల పై పార్టీ నేతలకు ఉన్న అనుమానాల పై షర్మిల క్లారిటీ ఇచ్చేసారు.ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల వద్ద అభిమానులు ప్రతిపాదన పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఎవరు వదిలిన బాణం కాదు అని స్పష్టం చేసారు. నేను టీఆర్ఎస్ కో లేక బీజేపీ కో.. బి టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదు అని స్పష్టత ఇచ్చారు. సమస్యల సాధనకు తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టాను అని, ఖమ్మం వేదిక గానే సమర శంఖం పూరిద్ధాం అని అన్నారు. లక్ష మందితో ఏప్రిల్ 9 న పార్టీ పెడదాం అన్నారు