విజయవాడ మార్చి 17,
విశాఖ ను పరిపాలన, అమరావతి ని లేజిస్లేటివ్ రాజధానిగా కర్నూల్ ను న్యాయ రాజధానిగా ప్రకటించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.రాజధాని పెరు చెప్పి ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అమరావతి విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహ న్ రెడ్డి ..ఆనాడు ఎం చెప్పారో..అదే జరిగిందని చెప్పారు.ఏ రోజు సీఎం అసెంబ్లీ లో ప్రకటించారో..ఆ రోజు నుంచి మూడు రాజధానులు ప్రక్రియ మొదల యిందని కానీ కర్నూల్ హైకోర్ట్ విష యంలో న్యాయ పరమైన అంశాలు న్నాయని చెప్పారు.అమరావతి భూములు విషయంలో నా దగ్గరకు బలహీన వర్గాలు ప్రజలు వచ్చి ఫిర్యాదు చేశారని సుమారు 5 వేల ఎకరాలలో అవకతవకలు జరినట్టు తెలుస్తోందని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణను మేము వ్యతిరేకమని ఈ విషయాన్ని అసెంబ్లీ లో కూడా చర్చిస్తామని తెలిపారు.అఖిల పక్షాన్ని, కార్మిక సంఘాలను తీసుకుని వస్తామని,ఢిల్లీ లో ప్రధాని కార్యాల యాన్ని ఇప్పటికే అపాయింటమెంట్ కోరామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకునే చర్యలకు తగినట్టు మా స్పందన ఉంటుందని చంద్రబాబు రాజధాని పేరుతో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి దోపిడీ చేసి అవినీతి చేశారని తెలిపారు.