YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 29 న వైకాపాలోకి కాటసాని

ఈనెల 29  న వైకాపాలోకి కాటసాని

బీజేపీ రాష్ట్ర నాయకుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ నెల 29న జగన్ పాదయాత్రలో భాగంగా గుడివాడలో వైసీపీ కండువా వేసుకోనున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 60వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల అనంతరం కాటసాని కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. రాష్ట్ర నాయకుడుగా ఆ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీజేపీని వీడాలనే నిర్ణయించుకున్నారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఈ నెల 18న నిర్వహించిన  కాటసాని ఆ దిశగా రంగం సిద్ధం చేసుకున్నారు.

కార్యకర్తల సూచనల మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు కాటసాని ధృవీకరించారు. ఈ మేరకు ఈ నెల 29 న  గుడివాడలో జగన్  సమక్షంలోనే వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమానికి కర్నూలు నగరం, పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులతో వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచే బరిలో ఉంటానని కాటసాని స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గానికి గౌరు చరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాటసాని వైసీపీలో చేరితే గౌరు దంపతులని కాదని వైఎస్ జగన్ కాటసానికి వైసీపీ టికెట్ ఇస్తారా..? అసలు వైసిపి వ్యూహం ఏంటి అనేది ఆ పార్టీలోనే కాక ఇటు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ ప్రధాన చర్చగా మారింది.

అయితే బీజేపీలో తనకు సముచిత స్థానం లభించలేదని, కార్యకర్తల అభీష్టం మేరకే  తాను పార్టీ మారి వైసిపిలో చేరదానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు పార్టీ అధిష్ఠానం నుంచి సంపూర్ణ మద్దతు ఉందని కాటసాని చెబుతున్నారు. తను పార్టీ మారటం వల్ల పార్టీలో అంతర్గతంగా ఏర్పడే సమస్యలను, ఇంటి పోరును పార్టీ అధిష్టానమే చూసుకుంటుందన్నారు.

ఇదిలా ఉంటె  తాజాగా జరుగుతున్న  పరిణామాలపై గౌరు వర్గం స్పందించారు..  కాటసాని రాకను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.. ఐతే మళ్ళీ టికెట్ గౌరు కు ఇస్తారా లేక కాటసానికి ఇస్తారా  వైసిపి యొక్క వ్యూహం ఏంటి అనేది వేచిచూడాల్సిందే.

Related Posts