YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రామ చిలుకకు అంత్యక్రియలు

రామ చిలుకకు అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా మార్చి  17, 
వానర సైన్యంగా, ఆంజనేయుడి ప్రతిరూపంగా భావిస్తూ, కోతులకు అంత్యక్రియలు నిర్వహించడం చూశాం, విన్నాం. కానీ రామచిలుక కు అంత్యక్రియలు నిర్వహించడం కొత్తగా వింటున్నాం. కళ్లారా చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో మేడేపల్లి నుండి కట్టకూరు వెళ్లే మార్గంలో ఓ రామ చిలుక మృతి చెందింది. రామచిలక కు అంత్యక్రియలు నిర్వహించి, తమ రామభక్తిని చాటుకున్నారు స్థానిక రైతులు.  తమ వ్యవసాయ భూమిలో అపస్మారక స్థితిలో ఉన్న రామచిలుక తమ కళ్లెదుటే చనిపోవటాన్ని చూసిన రైతులు రామభక్తితో, రామనామమే తమకు పరమపదంగా భావిస్తూ రామచిలుక కు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ సందర్భంగా మేడేపల్లి గ్రామ రైతు సామినేని పూర్ణచందర్రావు మాట్లాడుతూ రామచిలుక కు అంత్యక్రియలు నిర్వహించటం రామునికి సేవ చేసినట్లుగా ఉందన్నారు.  మేడిపల్లి గ్రామస్తులు నంద్యాల అప్పయ్య మాట్లాడుతూ మనుషులపై ఆధారపడి సహజీవనం సాగిస్తున్న పశువులూ, పక్షులు చనిపోయిన సందర్భాల్లో బాధ కలుగుతుందనా, అయితే రామ నామంతో ఉన్న రామచిలుక చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తే మంచిదనే భావనతో నిర్వహించామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.   గ్రామ రైతు పోతునూక మధుసూదన్ రావు మాట్లాడుతూ తమ కళ్లెదుటే అకస్మాత్తుగా చనిపోయిన రామచిలుక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, రామచిలుకను అలా వదిలి పెట్టడం మంచిది కాదనే భావనతో, అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.  మనపై ఆధారపడి జీవించే పశువులూ, పక్షులు మరణించిన సందర్భాల్లో వాటిని అలా వదిలేయకుండా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా తోటి జీవుల పట్ల జాలిని చూపొచ్చని, పర్యావరణాన్నీ కాపాడవచ్చనే సందేశాన్ని అందించిన మేడేపల్లి గ్రామ రైతులకూ, గ్రామస్తులకు పలువురు అభినందనలు తెలియ చేశారు.    కార్యక్రమంలో గ్రామ రైతులు సామినేని పూర్ణచందర్ రావు, పోతునూక మధుసూదన్ రావూ, గ్రామస్తులు నంద్యాల అప్పయ్యా, మోర వెంకటరామారావూ, ఎడవెల్లి గ్రామానికి చెందిన పరికపల్లి ఆదినారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.  

Related Posts