కొత్తపేట మార్చి 17,
వేధింపులలో భాగమే చంద్రబాబు నాయుడుకి సీఐడీ నోటీసులు ఇచ్చా రని,అక్రమ కేసులకు భయపడేది లేద ని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో గెలుపును బలుపుగా భావించి ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని,చంద్రబాబు నాయుడుగారుకి సీఐడీ నోటీసులు వేధింపులలో భాగమేనని అన్నారు. ధనప్రవాహం, బెదిరింపులు మున్సిపల్ ఎన్నికలలో ప్రభావం చూపాయని, పంచాయతీ ఎన్నికల అనంతరం జరగబోయే మండల,జిల్లా పరిషత్తు ఎన్నికలులో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, దోపిడీ వంటి అంశాలను ప్రజలు గుర్తిస్తారని అన్నారు.తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో బుధవారం టీడీపీ నేతలతో సమావేశంలో మాట్లాడారు.పనితీరుతో ఎంపీటీసీ, జడ్పీటీసీలను గెలుచుకుం టామని,ఇండ్ల స్థలాలు ఇచ్చారన్న కృతజ్ఞత, ఓటేయకపోతే పట్టాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు వెరసి మున్సి పల్ ఎన్నికలలో వైసీపీ విజయానికి దోహదం చేశాయని అన్నారు.సంక్షేమ పధకాలు అమలులో మరో మూడేళ్ళు సమస్యలు కొని తెచ్చుకోవడం యిష్టం లేని కొందరు, వలంటీర్లుతో పాటు అధికార యంత్రాంగం బెదిరింపులు కారణంగా పలు చోట్ల ఓటింగ్ సరళి ప్రభావితం కావడం చూస్తున్నామని పోలింగు శాతం తగ్గడం తెలుగు దేశం పార్టీకి పలు చోట్ల విజయాన్ని దూరం చేశాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి పనితీరు కనపరచిన చోట టీడీపీకి విజయాలు వరించాయని, కొత్తపేట నియోజకవర్గంలో ఆల మూరు.ఆత్రేయపురం,కొత్తపేట,రావులపాలెం మండలాలలో ఎంపీటీసీ.జడ్పీటీసీ ఎన్నికలలో మంచి పనితీరు కనపరచి గెలుపు సాధిస్తామని అన్నారు.నియోజకవర్గం వ్యాప్తంగా అవినీతి,దోపిడీలను అడ్డుకొని పేదవాడి సంక్షేమాన్ని వారికి చేరేలే తెలుగు దేశం పార్టీ పని చేస్తుందని అన్నారు.