YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

భట్టి వర్సెస్ కేసీఆర్

భట్టి వర్సెస్ కేసీఆర్

హైదరాబాద్, మార్చి 17, 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడురోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సభలో గవర్నర్ ధన్యవాదాల తీర్మానం పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనల గురించి ప్రస్తావించారు. గవర్నర్ తమిళిసై వ్యవసాయ రంగం గురించి గొప్పగా చెప్పారన్నారు. అయితే కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు అని భట్టి వ్యాఖ్యానించారు.భట్టి ప్రసంగంలో జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్... భట్టి ఉప సభాపతిగా పనిచేశారన్నారు. సభ నిబంధనలు వారికి తెలుసన్నారు. కేంద్ర చట్టాలను ఒక లిమిట్ వరకు మాత్రమే అసెంబ్లీ లో చర్చించుకోగలుగుతామని స్పష్టం చేశారు. రాష్ట్రం వరకు మనం చెప్పాల్సినది సభ నుంచి...బయట నుంచి చెప్పామన్నారు గులాబీ బాస్. కేంద్ర ప్రభుత్వ చట్టాలపై మాట్లాడే పరిధి శాసన సభకు లేదన్నారు. కొంత లిమిట్ వరకు చెప్పవచ్చన్నారు. పార్లమెంట్ లో మీ పార్టీ సభ్యులు ఉన్నారన్నారు. అక్కడ మాట్లాడమని చెప్పండి అని భట్టి పై కేసీఆర్ మండిపడ్డారు. వ్య‌వ‌సాయ రంగం గురించి త‌మిళిసై చాలా గొప్పగా చెప్పారని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త‌ వ్య‌వ‌సాయ చ‌ట్టాలు మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా ఉన్నాయని ఆయ‌న చెప్పారు.ఈ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారని, వారు ఆందోళ‌న చెందుతున్నారని తెలిపారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై సీఎం కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నేత‌ భ‌ట్టి విక్ర‌మార్క ఉప స‌భాప‌తిగా కూడా ప‌ని చేశారని, సభా నిబంధ‌న‌లు ఆయ‌న‌కు బాగా తెలుస‌ని అన్నారు. తాము వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై చెప్పాల్సింది గ‌తంలోనే చెప్పామ‌ని కేసీఆర్ అన్నారు.అసెంబ్లీలో తెలంగాణ‌కు సంబంధించిన విష‌యాలు మాట్లాడుకుంటే మంచిదని చురకంటించారు. కాంగ్రెస్ ఎంపీలు పార్ల‌మెంటులో ఆయా విష‌యాల‌పై మాట్లాడుకోవాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వ‌ ప‌రిధిలో వ‌చ్చే విష‌యాలను అక్క‌డ మాట్లాడితేనే మంచిద‌ని చెప్పుకొచ్చారు.

Related Posts