హైదరాబాద్, మార్చి 17,
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును చేర్చారు. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. అలాగే మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారుఅమరావతి భూముల కేసు.. మాజీ మంత్రి నారాయణ ఇంటికి సీఐడీ అధికారులుఏపీలో అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు వచ్చాయి. బుధవారం హైదరాాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు తీసుకెళ్లారు. కానీ నారాయణ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన సతీమణి రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22 న విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే నెల్లూరులోని నారాయణ నివాసానికి కూడా సీఐడీ అధికారులు వెళ్లారు. ఈ కేసులో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరును చేర్చారు. రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్‌గా చంద్రబాబు వ్యవహరించారు. అలాగే మాజీ మంత్రి నారాయణ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఐపీసీ సెక్షన్ 120బీ, 166,167, 217 సహా అసైన్డ్ భూముల అమ్మకం నిరోధక చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా సీఐడీ కేసు నమోదుచేసింది.. అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. ఇప్పుడు నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు కలకలంరేపాయి.