YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిఐడి అధికారుల ఎఫ్‌ఐఆర్‌ పై హైకోర్టులో చంద్రబాబు సవాల్‌!

సిఐడి అధికారుల ఎఫ్‌ఐఆర్‌ పై  హైకోర్టులో  చంద్రబాబు సవాల్‌!

గుంటూరు  మార్చి  17, 
అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టులో సవాల్‌ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతి అసైన్డ్‌ రైతులను 'చంద్రబాబు' మోసగించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన సీఐడీ 'చంద్రబాబు'కు నోటీసులు జారీ చేసింది. నిన్న హైదరాబాద్‌లోని 'చంద్రబాబు' ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. దానిలో తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఈ నెల23న తమ ముందు హాజరు కావాలని, ఎవరినీ బెదిరించడం కానీ, ప్రలోభపెట్టడం కానీ చేయవద్దని, ఒకవేళ అలా చేస్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని సిఐడి పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈ రోజు మాజీ మున్సిపల్‌ మంత్రి పి.నారాయణకు కూడా సీఐడి అధికారులు ఇదే కేసులో నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటిలో ఈ నోటీసులను అందజేశారు. సీఐడీ నోటీసులు ఇచ్చే సమయంలో 'నారాయణ' ఇంటిలో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. అసైన్డ్‌ రైతులు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, ఎమ్మెల్యే ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేయడంపై టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో 'చంద్రబాబు' విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని, దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని న్యాయనిపుణులు ఇచ్చిన సూచనతో 'చంద్రబాబు' రేపు హైకోర్టులో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌పై క్వాష్‌ పిటీషన్‌ వేయబోతున్నారు. మొత్తం మీద..ఏమీ లేని కేసులో ఏదో ఉందని అధికారపార్టీ హంగామా చేస్తుందని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు.

Related Posts