YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఒవైసీ సడెన్ ఎంట్రీ లెక్క అదేనా

ఒవైసీ సడెన్ ఎంట్రీ లెక్క అదేనా

అనంతపురం, మార్చి 18, 
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. మొన్నటి వరకూ జగన్ కు మిత్రుడిగా ఉన్న ఒవైసీ ఒక్కసారిగా శత్రువుగా మారిపాయారా? ఇందుకు కారణాలేంటి? అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా సాగుతోంది. అసదుద్దీన్ ఒవైసీ తొలి నుంచి జగన్ కు సన్నిహితంగా ఉన్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ, అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోనూ ఒవైసీ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు.మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాల్లో తన పార్టీ విస్తరణకు అసదుద్దీన్ ఒవైసీ కసరత్తులు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గణనీయమైన విజయాలు కూడా సాధించారు. తొలుత స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగి తర్వాత శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం అసదుద్దీన్ ఒవైసీ వ్యూహంలో ఒక భాగం. హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎంను ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నం చేసినా ఇప్పటి వరకూ ఏపీలో మాత్రం కాలు మోపలేదు.కానీ ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అసదుద్దీన్ వచ్చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయను ఎంఐఎంను పరిచయం చేశారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కొన్ని వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. కొన్ని చోట్ల ప్రచారాన్ని కూడా అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అసదుద్దీన్ బేస్ ను రెడీ చేసుకుంటున్నారన్నది వాస్తవం.అయితే ఇందుకు ప్రధాన కారణం వైఎస్ షర్మిల అంటున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ హడావిడి మొదలయిన తర్వాతనే అసదుద్దీన్ ఒవైసీ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారంటున్నారు. షర్మిలకు తెలంగాణతో సంబంధం లేకపోయినా ఒక సామాజికవర్గం ఓట్లను చీల్చేందుకే ఆమె పార్టీ పెడుతున్నారని ఒవైసీ భావిస్తున్నారు. అందుకు ప్రతిగా జగన్ ఓటు బ్యాంకును చీల్చేందుకు అసదుద్దీన్ ఒవైసీ ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. మరి షర్మిల ఎఫెక్ట్ జగన్ కు ఈ రూపంలో పడిందనే చెప్పాలి

Related Posts