YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాసులు నింపుతున్న రవాణా

కాసులు నింపుతున్న రవాణా

అనంతపురం జిల్లా రవాణా శాఖ వివిధ సేవలు, పన్నులు, తనిఖీల ద్వారా ఖజానాను నింపుతోంది.  నిబంధనల ఉల్లంఘనుల పేరుతో ముక్కు పండి మరీ వసూళ్లు చేస్తున్నారు.  2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.175.43 కోట్లు ఆదాయాన్ని సమకూర్చాలని రవాణా శాఖ నిర్దేశించిన నేపథ్యంలో రూ.187.13 కోట్లు ఆర్జించి రాష్ట్రంలో 5వ స్థానంలో జిల్లా నిలిచింది. ఈ లక్ష్యంలో 106.67 శాతం సాధించడం విశేషం. ఇందులో త్రైమాసిక పన్నులు రూ.43.82 కోట్లకు గానూ, రూ.44.11 కోట్లు (100.67 శాతం) సాధించి రాష్ట్రంలో రెండో స్థానం, లైఫ్ టాక్స్ వసూళ్లలో రూ.8,028 కోట్లకు గానూ, రూ.8,264 కోట్లు (102.94 శాతం) వసూలు చేసి మూడోస్థానం, ఫీజుల రూపేణా రూ.20.61 కోట్లకు రూ.33.81 కోట్లు (164.09 శాతం) రాబట్టి రెండో స్థానం, సర్వీస్ చార్జీల రూపేణా రూ.5.84 కోట్లకు గానూ రూ.6.13 కోట్లు (105.08 శాతం) వసూలు చేసి రెండో స్థానంలో నిలిచి లక్ష్యాన్ని సాధించింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 27 శాతం అదనంగా సమకూర్చుకుంటోంది. లక్ష్య సాధనకు రవాణా శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలతో పాటు ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 54,712 కేసులను రవాణా శాఖ అధికారులు నమోదు చేశారు. ఈ సంఖ్య 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు 23,215 కాగా, 2017 జనవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 31,497 కేసులు నమోదు చేశారు. కాగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో తనిఖీల  ద్వారా రూ.24.88 కోట్లు వసూలు చేయాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. దీంతో లక్ష్య సాధనలో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారులు రూ.20.42 కోట్లు మేర అపరాధ రుసుం వసూలు చేశారు. రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్నప్పటికీ కరవు జిల్లా అనంతపురంలో మాత్రం ఇది భారీ మొత్తమే. కాగా అధికారిక గణాంకాల మేరకు 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికుల్ని చేరవేయడంపై 444, అతి వేగంపై 165, అధిక లోడుతో సరుకు రవాణా చేస్తున్న వాహనాలకు 2,736, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిపై 9,739 కేసులు నమోదు చేశారు.

Related Posts