YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఆగమ్య గోచరం... వైజాగ్ ప్లాంట్ భవితవ్యం

ఆగమ్య గోచరం... వైజాగ్ ప్లాంట్ భవితవ్యం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పేరుకు పెద్దే గానీ.. ఇప్పటికీ సొంత గనులు సమకూర్చుకోలేని దుస్థితి.. మరోవైపు విస్తరణ ప్రాజెక్టులతో ప్లాంట్‌ సామర్థ్యాన్నిపెంచుకుంటూపోతున్నా, అందుకు తగినట్లు శాశ్వత ఉద్యోగులను నియమించకపోవడంతో నిపుణులు, అనుభవజ్ఞుల కొరత.. ఈ పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన రేపుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే ఉద్యమంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం రంగం సిద్ధంచేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం, అమరావతి నిర్మాణాలలో నామమాత్రంగా విశాఖ స్టీల్ ఉత్పత్తులను వాడుతుండడంపై పలు సందే హాలు వ్యక్తమవుతున్నాయి. స్టీలు అమ్మకాలు ప్రధాన సమస్యగా వున్న ప్పుడు నాణ్యత కలిగిన విశాఖ స్టీల్‌ను వాడవలసిన అవసరాన్ని ప్రభు త్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్‌ను పెంచడానికి విశాఖలోనే ప్లాంట్ వద్ద ఔట్‌లెట్‌లను ఏర్పాటుచేసి ప్రజలకు నేరుగా స్టీల్ అమ్మాలి. అలా జరగడం లేదు. ప్రచార ఆర్భాటాలు, బ్రాండ్ అంబాసిడర్లకు డబ్బులు తగలేసి భారీ ప్రకటనల వల్ల స్టీల్ అమ్ముడుపోదు. విశాఖ స్టీల్‌ను మార్కెటింగ్ చేసేందుకు అనువైన యంత్రాంగం, మార్కెట్ వ్యూహాలను ప్రభుత్వాలను నిర్లక్ష్యం చేస్తున్నాయి. దాంతో లాభాల బాట లో నడవాల్సిన ప్లాంట్ నష్టాల్లోకి కూరుకుపోయే పరిస్థితి ఎదురైంది.

పి.వి. నరసింహారావు ప్రధాని కాగానే తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా వదలలేదు. 1991 నుంచి జోరు గా సాగుతున్న ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అనేక విధాలుగా దాన్ని నీరుగార్చేందుకు ప్రయత్ని స్తోంది. ముక్కలు ముక్కలు చేసి ప్రైవేటీకరిం చాలని ఆలోచిస్తోంది. టాటా, బిర్లాలకు దాన్ని కారుచౌకగా కట్టబెట్టాలని ప్రయత్నాలు 1999 నాటి నుంచి ప్రారంభించింది. ఆ నాటికి రూ. 4 వేల కోట్ల అప్పుల్లో విశాఖ ప్లాంట్ కూరుకుపోయిందని బీఐ ఎఫ్‌ఆర్‌కు పరిశీలనకు పంపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. 2000లో కార్మికులు, ప్రజా పోరాటాలు విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకున్నాయి. రూ. 4 వేల కోట్లు అప్పు పోను 2008 నాటకి రూ. 6 వేల కోట్లు అదనంగా విశాఖ స్టీల్ లాభాలనార్జించి సత్తాచూపింది. ఆనాటి నుంచి 2014 వరకు నికర లాభాలతో నడిచింది. కానీ 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఆరంభం కావడంతో ప్రపంచ మార్కెట్ స్టీల్ ధరలు వేగంగా దిగజారాయి. అయి నా విశాఖ స్టీల్ 3.2 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నుల విస్తరణకు మరో రూ. 6500 కోట్లు అప్పులు తెచ్చి విస్తరించింది. నేడు ఈ అప్పులు, వడ్డీలు కలిపి రూ. 15 వేల కోట్లకు చేరాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పుట్టుక నుంచి ఎప్పుడూ నిర్వహణ నష్టాలు లేవు. పెట్టిన పెట్టు బడులకు ఆదాయాలు బాగానే వచ్చాయి. వడ్డీలు నష్టలే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిరంతరం వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్ద కుండా నిర్లక్ష్యం చేయడంతో ప్లాంట్‌పై రుణభారం అధికంగా పడుతోంది. ఇదంతా ప్రైవేటీకరణ కుట్రతోనే సాగుతుందన్నది అందరికీ అర్థమవుతోంది. విశాఖ స్టీల్‌ను కూడా అప్పుల పాలు చేసేందుకు అన్ని ప్రయత్నాలూ కేంద్రం చేస్తున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖలోని డీసీఐ పుట్టినప్పటి నుంచి లాభల్లో నడుస్తున్నా ఇప్పుడు అడ్డగోలుగా పూర్తి ప్రైవేటీకరణకు కేంద్రం ఆలోచిస్తోంది. 32 మంది బలి దానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కులో రాష్ట్రంలోనే అతి పెద్ద పరి శ్రమ. 30వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయం ప్రజావ్యతిరేకమైనది. ఈ ప్లాంట్ కోసం 14 వేల మంది రైతులు 22 వేల ఎకరాల తమ భూములు, ఇళ్లు, వాకిళ్లు త్యాగం చేశారు.  ప్రైవేటీకరణతో వారి త్యాగాలన్నీ గంగపాలైనట్లే. విశాఖ స్టీల్ ప్లాంట్ 1.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి నుంచి నేడు 6.3 మిలియన్‌లకు విస్తరించింది. నాణ్య తలో ప్రపంచ స్థాయితో అత్యాధునిక స్టీల్‌ను ఉత్పత్తి చేస్తున్నా సరైన మార్కెటింగ్, యాజమాన్య పద్ధతులను అనుసరించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడతో విశాఖ ప్లాంట్‌కు నష్టాల గ్రహణం పట్టిం ది. పన్నులు, డివిడెండ్ల రూపంలో నేటికి రూ.36,400 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్లాంట్  చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఇతర భారీ స్టీల్ ప్లాంట్లకు పూర్తిగా నిధులు సమకూర్చింది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రారంభదశలో ఇచ్చిన రూ.5 వేల పెట్టుబడితోనే ప్రభుత్వం నిధులను సమకూర్చడం ఆపివేసింది. స్టీల్ ప్లాంట్ సొంత లాభాలతో నడుస్తూ రూ.12,500 కోట్ల పెట్టుబడితో 6.3 మిలియన్ టన్నులకు విస్తరించి, 2008లో రూ. 2,200 కోట్లు లాభాన్ని ఆర్జించింది. అంతటి శక్తి సామర్థ్యాలున్న ప్లాంట్‌ను ప్రైవేటీకరణ పేరుతో తెగనమ్మేందుకు కేంద్రం ప్రయత్నించడం ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే తప్ప వేరు కాదు. సొంత గనులు ఉంటే ఇతర స్టీల్ ప్లాంట్‌తో పోటీ పడి విశాఖ ప్లాంట్ లాభాల బాటలో దేశంలోనే ముందంజలో ఉండగలదు. అయితే విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలన్న దురుద్దేశంతో కేంద్రం అనేక అడ్డంకులు, ఇబ్బందులకు ప్లాంట్‌ను గురిచేయడంపై ప్రజలు ఉద్యమించాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తి. వాటిని కారుచౌకగా ఆశ్రిత కార్పొరేట్ శక్తులకు తెగనమ్మితే చరిత్ర క్షమించదు. ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకు పైగా పెరిగినా.. ప్రారంభంలో ఉన్న సిబ్బంది సంఖ్యే దాదాపు ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు సీనియర్లు పదవీ విరమణ చేస్తుండటం, మరణిస్తుండటంతో నిపుణుల కొరత ఎదురవుతోంది.విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సిబ్బంది కొరత నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. విస్తరణతో ఉత్పత్తి సామర్ద్యం రెండింతలు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న సిబ్బందికి పని భారం పెరిగింది. ఫలితంగా కొత్త విభా గాలను పూర్తిస్ధాయిలో నిర్వహించలేకపోతున్నారు.అప్పటి నుంచి 2000–01లో పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సాధించే నాటికి ప్లాంట్‌లో 17,454 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. వారిలో సీనియర్‌అధికారులు 2,832 మంది, జూనియర్‌అధికారులు 1,195 మంది కాగా కార్మికులు 13,104 మంది ఉన్నారు.ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌టన్నులకు పెరిగినా.. ఉద్యోగుల సంఖ్య మాత్రం దాదాపు అంతే ఉంది, ఉత్పత్తి పెంపుపైనే శ్రద్ధ ప్రారంభంలో మూడు మిలియన్‌టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్‌టన్నులకు పెంచడానికి 2005లో అనుమతి లభించింది. అదే సమయంలో మూడువేల మంది కొత్త ఉత్యోగులను పెంచడానికే కేంద్రం అనుమతినిచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అనంతరం చేపట్టిన ఆధునికీకరణ పనులతో ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌టన్నులకు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం ప్రారంభంలో ఉన్న 17,454 నుంచి 17,875కు మాత్రమేఅంటే పెరిగిన ఉద్యోగుల సంఖ్య 744 మాత్రమే. ఉద్యోగులు పెరగకపోవడంతో పాత యూనిట్ల నుంచి కొత్త యూనిట్లకు ఉద్యోగులను బదిలీ చేశారు. ఫలితంగా యూనిట్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. స్పెషల్‌బార్‌మిల్, స్ట్రక్చరల్‌మిల్, వైర్‌రాడ్‌మిల్‌–2 వంటి విభాగాల్లో అరకొరగా సిబ్బంది ఉండటంతో మూడు షిఫ్ట్‌లలో పని చేయించలేకపోతున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.పెరిగిన ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా 20 వేల మంది శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించినప్పటికి యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపటట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి నెలా కనీసం 20 మంది పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు 10 మంది మరణిస్తున్నారు. వీటన్నిం టి వల్ల సీనియర్‌ఉద్యోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది. కాగా 2022 నాటికి సుమారు 4,600 మంది మొదటితరం ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ప్లాంట్‌పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Related Posts