విజయవాడ మార్చి 18,
మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి 160 సీఆర్పీసీ ప్రకారం ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. అమరావతి భూములు విషయంలో తనకందిన సమాచారం, తన వద్దకు రైతులు తీసుకొచ్చిన అంశాలను బేస్ చేసుకుని.. ఏదైతే కేసు ఫైల్ చేశారో.. ఆ వివరాలు, ఆధారాలను సమర్పించాలని సీఐడీ సూచించింది. దిని నిమితమై ఈ రోజు విజయవాడ సత్యనారాయణ పురంలోని సి ఐ డి కార్యాలయా లో విచారణకు హచారైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. రైతుల ఫిర్యాదుతోనే రాజధాని భూముల అక్రమాలపై ఆళ్ల కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఆళ్లకు ఫిర్యాదు చేసిన రైతులు ఎవరనే చర్చ ఊపందుకుంది. బేతపూడి, ఎర్రబాలెం, నవులూరుకు రైతులుగా ప్రచారం జరుగుతుంది. కాగా DSP సూర్యభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కేసులో ప్రాథమిక విచారణ కొనసాగుతుంది. త్వరలో రైతుల స్టేట్మెంట్ సీఐడీ రికార్డు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక 41 సీఆర్పీసీ కింద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు సీఐడీ చీఫ్ సునీల్కుమార్. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.