YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం..నకిలీ ,బోగస్ ఓట్లకు చెక్... కేంద్రం సంచలన నిర్ణయం

ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం..నకిలీ ,బోగస్ ఓట్లకు చెక్...  కేంద్రం సంచలన నిర్ణయం

న్యూ డిల్లీ మార్చి 18, 
ఓటర్ ఐడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది... ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం చేయనున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.లోక్‌సభలో వెల్లడించారు. ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించిన కేంద్ర మంత్రి.. ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో కూడా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు.కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పటికప్పుడు బోగస్ కార్డులు బటయపడుతూనే ఉన్నాయి.. మరోవైపు.. తమ ఓటు గల్లంతు అయ్యిందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు..
ఎన్నికలకు వచ్చిన ప్రతీసారి ఇది ఎన్నికల సంఘానికి పెద్ద తలనొప్పిగా మారింది. జాగ్రత్తలు తీసుకుంటున్నా బోగస్‌ కార్డులను ఈసీ నియంత్రించలేకపోతోంది. అయితే, బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది.ఇక ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరికి ఒక్క ఓటు మాత్రమే పరిమితం అవుతుందని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

Related Posts