YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు

ఇండియన్‌ ఆర్మీ- చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో అక్టోబరు నుంచి ప్రారంభమయ్యే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్సు కోసం అవివాహిత ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ (పురుషులు, మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 191. ఇందులో టెక్నికల్‌ విభాగానికి సంబంధించి 190 ఖాళీలు ఉన్నాయి. నాన్‌ టెక్నికల్‌ విభాగంలో ఒక పోస్టు మాత్రమే ఉంది. దీన్ని డిఫెన్స్‌ పర్సన్స్‌ విడోస్‌కు కేటాయించారు.

టెక్నికల్‌ విభాగంలో పురుషులకు 175, మహిళలకు 15 పోస్టులను కేటాయించారు. విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌ 53, మెకానికల్‌ 19, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ & ఎలకా్ట్రనిక్స్‌ 24, ఏరోనాటికల్‌/ ఏవియేషన్‌/ బాలిస్టిక్స్‌/ఏవియోనిక్స్‌ 12, కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటి/ కంప్యూటర్‌ టెక్నాలజీ 34, ఎలకా్ట్రనిక్స్‌ & టెలికాం/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ 30, ఎలకా్ట్రనిక్స్‌/ ఆప్టో ఎలకా్ట్రనిక్స్‌/ ఫైబర్‌ ఆప్టిక్స్‌/ మైక్రో ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ మైక్రో వేవ్‌ 11, ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ 3, ఆర్కిటెక్చర్‌/ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ 3.

అర్హత ..సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 1 నాటికి కోర్సును తప్పనిసరిగా పూర్తిచేయాలి. నాన్‌ టెక్నికల్‌ విభాగానికి ఏదైనా డిగ్రీ పాసైతే చాలు.

వయసు..అక్టోబరు 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. డిఫెన్స్‌ పర్సన్స్‌ విడోస్‌కు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక..ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఆర్మీ హెడ్‌ క్వార్టర్‌ నిర్ణయించిన కటాఫ్‌/ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎస్‌ఎస్‌బిలో రెండు దశలు ఉంటాయి. ఈ రెండు దశలు అయిదు రోజుల పాటు జరుగుతాయి. అనంతరం మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించి పోస్టింగ్‌ను ఖరారు చేస్తారు.

శిక్షణ..ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది..దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2018.

వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

Related Posts