హైదరాబాద్ మార్చి 18, ఈ ఆర్ధిక యేడాది బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాబడుల్లో భారీ వృద్ధిరేటును ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383 కోట్లు, కేపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు అంచనా వేసారు. అలాగే రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు, ఆర్థికలోటు రూ.45,509.60 కోట్లు, నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.720 కోట్లు కేటాయించారు. ఆటవీ శాఖకు రూ.1,276 కోట్లు, ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు కేటాయించారు. ఇతర కేటాయింపులు (కోట్లలో) రైతు బంధు...14800, సాగునీరు...16931, సమగ్ర భూ సర్వే..400, పింఛన్లు..11728, కళ్యాణ లక్ష్మీ..2,750, యస్సీ ల ప్రత్యేక నిధి..21,306, యస్టీ ల ప్రత్యేక నిధి..12,304, నేతన్నల కు..338, బీసీ కార్పోరేషన్...1000, బీసీ సంక్షేమ శాఖ..5522, మైనారిటీ సంక్షేమం..1606, మహిళా, శిశు సంక్షేమం..1702, మూసీనది అభివృద్ధి... 200, మెట్రో రైలు..1000, అవుటర్ రింగ్ రెడ్డు వెలపల నీటి సరఫరా..250, వరంగల్ కార్పోరేషన్..250, ఖమ్మం కార్పోరేషన్..150, పుర ,పట్టణాభివృద్ధి శాఖ..15030, వైద్యం..6295, పాఠశాల విద్య..11735, ఉన్నత విద్య..1873, విద్యుత్ ..11046, పరిశ్రమలు..3077, ఐటి..360, రోడ్లు ,భవనాలు..8788, కొత్త ఓఆర్ఆర్ కోసం..750, హోంశాఖ..6465,పౌరసరఫరాల శాఖ..2363, పర్యాటక శాఖ..726 కేటాయించారు.
బడ్జెట్ ప్రవేశపెట్టాడినికి ముందు హరీష్ రావు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లకు బడ్జెట్ ప్రతులను అందజేసారు. మంత్రులు వేముల, శ్రీనివాస్ గౌడ్, పలువురు టీఆరెస్ ఎమ్మెల్యేలు అయన కు శుభాకాంక్షలు తెలిపారు.