YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అవినీతి, అక్రమాల పై సిబిఐచే దర్యాప్తు చేయాలి... బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు డిమాండ్

ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అవినీతి, అక్రమాల పై సిబిఐచే దర్యాప్తు చేయాలి...  బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు డిమాండ్

హైదరాబాద్ మార్చ్ 18 ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలు, అవినీతి పై సిబిఐ దర్యాప్తు చేయాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ రావు డిమాండ్ చేసారు. తెలంగాణలో అనేక సంవత్సరాలుగా వివాదాస్పద ఇపిఎస్ అధికారిగా పేరుగాంచిన ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా వుంది. ఒక ప్రభుత్వ ప్రజా సేవకుడిగా వుండి సమాజంలో విభజన వాదాన్ని రెచ్చగొట్టి, హిందువుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాడు, అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మతసామరస్యాన్ని విచ్చిన్నం చేసేవిధంగా, భంగం కలిగించే విధంగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం నిందనీయమైన విషయం.  హిందు మతం పై, హిందూ ధర్మం పై అయన తన మిత్రుల తో  కలిసి విషం చిమ్మే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖందించారు. అయన తన మిత్ర బృందంతో  కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం పై, తన యొక్క  మానస పుత్రిక అయిన స్వేరో సంస్థ ద్వారా తన మిత్రులకు కేటాయించిన కాంట్రాక్టుల పై , బినామి ఆస్తులపై వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  ఒక అంచానా ప్రకారం సాంఘిక సంక్షేమ బాద్యతలు తీసుకున్నప్పటి నుండి 500 కోట్ల రూపాయల కుంబకోణం చేసినట్టు తెలుస్తున్నదని, ప్రభుత్వ నియమాలకు భిన్నంగా రాజ్యాంగానికి విరుద్దంగా ఒక ప్రభుత్వ అధికారి గత అనేక సంవత్సరాలుగా చేసినటువంటి అక్రమాలు, అవినీతి వ్యవహారాలను సరియైన రీతిలో విచారణ చేయకుంటే పెద్ద ఎత్తున టిఆర్ఎస్-కేసిఅర్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని సాంఘిక సంక్షేమ బాద్యతల నుంచి తప్పించి ,ప్రభుత్వ బాధ్యత నుండి బర్తరఫ్ చేయాలని శేఖర్ రావు డిమాండ్ చేసారు.

Related Posts