హైదరాబాద్ మార్చ్ 18 .రైతులకు నష్టం కలిగించే మూడు నల్లచట్టాలను రద్దు కోరుతు ఈనెల 26న జరగనున్నభారత్ బంద్ ను రాజకీయ పార్టీలు , ప్రజాసంఘాలు, ప్రజలు సహాకరించి విజయవంతం చేయాలని సిపిఐ (యం.ఎల్) పార్టి రాష్ట్ర కార్యదర్శిమల్లేపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. దేశ ప్రధాని అవలంబిిస్తున్న ఆర్ధిక విధానలతో దేశ ప్రజలు ఆర్ధికంగా దెబ్బతిన్నరన్నారు. దేశ ప్రజలకు అన్నం పేడుతున్న రైతన్నల నడ్డివిరిచే 3 నల్ల చట్టాలను తీసుకుని వచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేశరని విమర్శించారు. పారిశ్రామిక వెత్తులకు ఉపోయోగ పడే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రైతులు ఆ చట్టాలను, రద్దు చేయాలని వివిధ రూపాయలలో నిరసనలు ఆందోళనలు చేస్తుంటే చర్చల రూపంలో కాలయపన చేస్తున్నరే తప్ప నల్ల చట్టాలను రద్దు చేయటంలో కేంద్ర ప్రభుత్వం మన కష్టాలు లెక్కిస్తుంది, విశాఖ, ఉక్కపరిశ్రమ కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు ప్రవేటికరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే కేంద్రం మాత్రం ప్రవేటికరణకే మొగ్గు చూపటం అత్యంత దారుణం , ప్రజా రైతు కర్షక, కార్మిక , విద్యార్థి, మహిళ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలను నిరసిస్తూ ఈ నెల 26న జరిగే దేశ వ్యాప్త బంద్ ను అన్ని రంగాల ప్రజలు సహకరించి బంద్ ను విజయవంతం చేయాలని ప్రబాకర్ కోరారు.