న్యూ ఢిల్లీ మార్చ్ 18 అంగారక గ్రహంపై నీటి జాడకోసం నాసా అనేక పరిశోధనలు జరపుతోంది.అందులో భాగంగా నాసా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. నాసా జరిపిన అధ్యయనం ప్రకారం మార్స్ అంతర్భాగంలో భారీగా నీటిజాడ నిక్షిప్తమై ఉండొచ్చునని తేలింది. ఈ అధ్యయనం ప్రకారం మార్స్‌పై లభించిన ఆధారాలతో , బిలియన్ల ఏళ్ల క్రితం మార్స్‌అంతటా సమృద్ధిగా కొలనులు , సరస్సులు ,లోతైన మహాసముద్రాలు ఉండేవని పేర్కొన్నారు.అంతా స్థాయిలో ఉన్న నీరు ఎక్కడికి వెళ్లిందనే విషయంపై నాసా పరిశోధనలు చేస్తోంది.నాసా కు సంబంధించి ఒక జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, మార్స్ పై ఉన్న నీరు 30 నుంచి 99 శాతం వరకు గ్రహం అంతర్భాగంలోని ఖనిజాలలో నిక్షిప్తమైనట్లు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జేపీఎల్) సంయుక్తంగా జరిపిన పరిశోధనల ప్రకారం.. సుమారు నాలుగు బిలియన్ ఏళ్ల క్రితం, అంగారక గ్రహంపై 100 నుంచి 1,500 మీటర్ల లోతులో సముద్రరూపంలో నీరు, గ్రహం మొత్తాన్ని నీటితో కపివేసిందనే విషయాన్ని కనుగొన్నారు. బిలియన్ ఏళ్ల తరువాత, మార్స్‌పై ప్రస్తుతం ఉన్న శుష్కనేలలతో పొడిగా ఉండే వాతావరణం ఏర్పడి ఉండోచ్చని తెలిపారు. మార్స్‌పై ప్రవహించిన నీరు అంగారక గ్రహానికి అతి తక్కు వ గురుత్వాకర్షణ శక్తి ఉండటంతో నీరు అంతరిక్షంలోకి వెళ్లి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ విశ్లేషణను మార్స్ రోవర్స్, ఆర్బిటర్స్ అందించిన డేటా సాయంతో కనుగొన్నారు.పరిశోధకుల అధ్యయనం ప్రకారం మార్స్ పొరల్లోని ఖనిజాలలో నీరు ఉండిపోవడం, వాతావరణంలోకి నీరు చేరడం వంటి విధానాలతో మార్స్ పై నీరు లేకుండా పోయిందని తేలింది. నీరు రాతితో కలిసినప్పుడు, రసాయన చర్య జరిగి మట్టి, ఇతర హైడ్రస్ ఖనిజాలు ఏర్ఫడతాయి. నీరు ఖనిజ నిర్మాణంలో భాగమై ఉందని వివరించారు. ఈ చర్య భూమిపైనే కాక అంగారక గ్రహంపై కూడా సంభవిస్తుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.