
దేశ వ్యాప్తంగా సెకెండ్ వేవ్ క్రియాశీల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా ప్రజల్లో సెకెండ్ వేవ్ కరోనా గుబులు రేపుతుంది. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో కరోనా విజృభిస్తున్న క్రమంలో సెకెండ్ వేవ్ దశ పట్ల అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో పాఠశాల, కళాశాలల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఏమైనా ప్రజలు సెకెండ్ వేవ్ పట్ల కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో గత పక్షం రోజుల క్రితం రెండు చోట్ల నిర్వహించిన కారోన టెస్ట్ ల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం, అది కొత్త స్టెయిన్ గా వైద్యులు అనుమానించడంతో జిల్లా ప్రజలను ఈ ఘటన కలవరపెడుతోంది. అదుపులో ఉన్నట్లే ఉన్న కరోన ఇప్పుడు అకస్మాత్తుగా కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా వయో వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన వారు ఉపాది నిమిత్తం దూర దేశాలకు, పొరుగు రాష్ట్రంగా ఉన్నా మహారాష్ట్ర లోని ముంబాయి కి వెళ్లడం, రావడం జరుగుతుండడం వల్ల అక్కడి నుండి ఎవరు వచ్చిన, వెళ్లిన ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో కరోన కేసులు పెరుగుతున్నాయని తెలుస్తోంది.ఉపాది కోసం విదేశాల్లోకె వెళ్ళి వారు సెలవుపై ఇక్కడకు వస్తుండగ వారంతా నేరుగా కుటుంబాలను కలవడం కూడా కారోన కేసులు విజృంభనకు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.