YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరు అగ్రగామి గా తీర్చిదిద్దుతా - ఎమ్మెల్యే శిల్పా

ఆత్మకూరు అగ్రగామి గా తీర్చిదిద్దుతా - ఎమ్మెల్యే శిల్పా

24 వార్డు లకు 23 వార్డ్ లు వైసీపీ కి ఇచ్చిన ఆత్మకూరు మున్సిపాలిటీని రాష్ట్రం లోనే అగ్రగామిగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా కొలువు దీరిన కౌన్సిల్ సభ్యుల సన్మాన సభ లో ప్రసంగిస్తూ ఎన్నికలు జరగక ముందే వైసీపీ గెలుచుకున్న 5 ఏకగ్రీవం మున్సిపాలిటీ ల్లో ఆత్మకూరు ఒకటి అన్నారు. ప్రభుత్వ ఇళ్ల పట్టాల పంపిణీ లో రాష్ట్రం అంతటా 1 సెంటు స్థలం ఇస్తే ఇక్కడ మాత్రమే 1.5 సెంట్లు ఇచ్చాం అన్నారు. శాదీఖానా కు మంజూరు అయిన నిధుల విషయం లో టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసి అభాసు పాలయ్యారు అని అన్నారు.
వాట్సాప్ ద్వారా నిరంతర నిఘా పెట్టి ఆత్మకూరు లో పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తున్నట్టు గుర్తు చేశారు.  చైర్మన్ గా ప్రమాణం చేసిన డా ఆసియా మారుఫ్ బహుశా రాష్ట్రం లోనే పిన్న వయసు అని, ఆత్మకూరు అభివృద్ధికి కష్టపడి తాను ఏమిటో నిరూపించు కోవాలన్నారు.  డా ఆసియా కు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

పదవి అంటే కుర్చీ కాదు.. బాధ్యత - శిల్పా కార్తీక్
వైసీపీ యువ నాయకులు శిల్పా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ పదవి అంటే కుర్చీ కాదు, ఒక బాధ్యత అని తెలుసుకొని కష్టపడితే రాజకీయం గా రానిస్తారు అన్నారు.  తన తండ్రి గారు అయిన ఎమ్మెల్యే శిల్పా ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారు అని, శిల్పన్న అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అని ఋజువు చేశారన్నారు. దెబ్బ కొడితే మళ్ళీ లేయ్యకుండా కొట్టాలి అన్న సామెత నిరూపిస్తూ ఆత్మకూరు లో 24 కు 23 వార్డు లు గెలిపించారు అని వ్యాఖ్యానించారు.
కొత్త చైర్మన్ డా ఆసియా నుద్దేశించి మాట్లాడుతూ విద్యావంతురాలవు కాబట్టి ఎమ్మెల్యే గారు గుర్తించి మీకు ఈ అవకాశం ఇచ్చారని, కష్టపడి పనిచేసి ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేసి ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు.


శిల్పన్న స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చా...
డా ఆసియా మారుఫ్
నియోజకవర్గం అభివృద్ధికి అలుపెరుగకుండా కష్టపడుతున్న ఎమ్మెల్యే శిల్పన్న స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చినట్లు చైర్మన్ డా ఆసియా మారుఫ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారం తో àఆత్మకూరును అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Related Posts