YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాళ్ల పాడు ప్రాజెక్టుకు అన్నీ అడ్డంకులే

 రాళ్ల పాడు ప్రాజెక్టుకు అన్నీ అడ్డంకులే

రాళ్లపాడు ప్రాజెక్టు పట్ల్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ ఆందోళన తీవ్రం చేశారు. రాళ్లపాడుకు నీరందించే సోమశిల ఉత్తరకాల్వ నిర్మాణం, ప్రాజెక్టు ఎడమకాల్వ పొడగింపు పనులు  పూర్తి చేయాలని, రాళ్లపాడు నుంచి నీళ్లు తరలించే జీఓ నంబర్‌ 40 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరందించే సోమశిల ఉత్తర కాల్వ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. చింతలదీవి అనే గ్రామం వద్ద భూసేకరణ సమస్యను పరిష్కరించకపోవడంతో ఒక అడుగు ముందుకు..మూడడుగుల వెనక్కి అన్నట్టు  సాగుతోంది. ప్రాజెక్టు ఎడమ కాల్వ పొడగింపు పనులు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, భూసేకరణ గ్రామాల్లో సోషల్‌ ఇంపాక్టు సర్వే పూర్తి  కాలేదు. ఈ కారణంతో పనులు ఆగాయంటే ప్రభుత్వ పనితీరు ఏవిధంగా ఉందో, కందుకూరు నియోజకవర్గం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా  రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. రాళ్లపాడు రైతులను ఆదుకోకపోతే గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మరోపక్క రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామథేనువు ప్రాజెక్టు నుంచి నీటిని తరలించేందుకు ప్రభుత్వం జీవో నంబర్‌ 40ని విడుదల చేయడంపై జనాలు మండిపడుతున్నారు. ప్రాజెక్టులో నీరు లేక నాలుగేళ్లుగా  కరువుకాటకాలతో అల్లాడుతుంటే ప్రాజెక్టు నుంచి నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కామథేను పశు అభివృద్ధి కేంద్రం భూముల్లోంచే సోమశిల కాల్వ వస్తున్నా అక్కడి నుంచి నీటిని మళ్లించకుండా, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి వెనక్కి 12కిలోమీటర్లు నీటిని తరలించడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఇది పూర్తిగా రాళ్లపాడు ప్రాజెక్టును నిర్వీర్యం చేసు కుట్రను ప్రభుత్వం చేస్తుందని, దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

Related Posts