YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చేపల చెరువులు కలుషితం

చేపల చెరువులు కలుషితం

చేపల చెరువులు కలుషిత మవుతున్నాయి.వ్యర్థ పదార్థలు, కుళ్లిన మాంసాలు, ఇతర జంతువుల కళేబరాలు చేపల చెరువుల్లో పడేస్తూ కలుషితం చేస్తుడంటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.  క్యాట్ ఫిష్‌ను చెరువుల్లో ఉపయోగించరాదని అధికారులు చెప్తున్నప్పటికీ చేపల యజమానులు వాటినే ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారుఈ పరిస్థితి నూజెండ్ల నుండి పమిడిపాడు వెళ్లే రహదారి చెరువుల్లో కనిపిస్తుంది. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. కలుషితమైన చెరువుల్లోని చేపల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంటోందని పలువురు విమిర్శిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా చేపల చెరువుల యజమానులు కుల్లిన మాంసం, కోడి కాళ్లు, వ్యర్థ పదార్ధాల చెరువుల్లో కలుపుతున్నారు. చేపల మేత ధరలు ఎక్కువగా ఉండటం, తక్కువ దరకే దొరికే ఇలాంటి వ్యర్ధాలనే యజమానులు ఉపయోగిస్తున్నారు. కలుషితమైన చెరువుల వద్ద దుర్గంధం వెదజల్లుతోంది. నూజెండ్ల నుండి పమిడిపాడు వెళ్లే రహదారి వెంట ఉన్న చేపల చెరువుల దుస్థితి ఇది. ఈ మార్గం గుండా పమిడిపాడు, ముతరాసుపాలెం గ్రామాలకు వెళ్లే ప్రజానీకం ముక్కు మూసుకుని పోవాల్సిందే.. ఇంత జరుగుతున్నా మత్యశాఖ అధికారులు చేపల చెరువుల వైపు కనె్నత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి మండలంలోని మిగిలిన చెరువుల్లో కూడా ఉపయోగిస్తున్నారని పమిడిపాడు, నూజెండ్ల గ్రామస్థులు చెప్తున్నారు. ఇప్పటికైన అధికారులు చెరువులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts