వైకాపాలో విభేదాలు లేవు
విశాఖపట్నం మార్చి 19,
విశాఖ వైసీపీలో మేయర్ పదవి తెచ్చిన విభేధాలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని పశ్చిమ నియోజకవర్గ నేత దొడ్డి కిరణ్ బర్త్ డే వేడుకల్లో మంత్రి స్పష్టం చేశారు. పార్టీకోసం కష్టపడిన వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ అని త్వరలో వంశీకృష్ణశ్రీనివాస్ కు కార్పొరేషన్ పదవి దక్కనుందన్నారు. నేతల్లో మనస్పర్దలు ఉంటే చర్చలద్వారా పరిష్కారం చేస్తామన్న అవంతి శ్రీనివాస్, పార్టీ ఎంపీ విజసాయిరెడ్డి అందరికీ న్యాయం చేస్తారన్నారు. అంతముందు దొడ్డి కిరణ్ ఏర్పాటు చేసిన వాహనాల పంపిణీ తో పాటుగా పలు సేవా కార్యక్రమాలను మంత్రి అవంతి ప్రారంభించారు.