పోలీసులకు వ్యాయామ సమయం కేటాయించాలి
- రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ
పెద్దపల్లి మార్చి 19,
రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాక్ ని పోలీస్ అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్పెషల్ పార్టీ సిబ్బందికి 800 మీటర్లు, 100 మీటర్లు పరుగు మరియు షాట్ పుట్ పోటీలు నిర్వహించి సీపీ చేతుల మీదుగా వారికి మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పోలీసులకు వ్యాయామ సమయం ఉండాలనీ, విధుల్లో ఎంత తలమునకలుగా ఉన్నప్పటికీ క్రీడలు, శారీరక వ్యాయామాలకు పోలీసులు తప్పకుండా సమయం కేటాయించాలని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తే పోలీసు వృత్తిలో సత్ఫలితాలు సాధించవచ్చని రామగుండము పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ అన్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని, వ్యాయామం దినచర్యలో భాగంగా అలవరుచు కోవాలని అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలి సిబ్బంది ఫిట్నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలి. వీలున్నప్పుడు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలన్నారు. ప్రజలకు నేరుగా సేవలందించే ప్రభుత్వ శాఖల్లో ఒకటైన పోలీసు శాఖలో ఉద్యోగం లభించటం అదృష్టంగా భావించాలన్నారు. కనిపించని శత్రువు మానసిక ఒత్తిడి అని విధినిర్వహణపైనే దృష్టి కేంద్రీకరిస్తే ఎలాంటి ఒత్తిడికిలో నవకుండా ప్రజలకు సేవలందిస్తూ సత్ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శరత్ చంద్ర పవర్, అడిషనల్ డీసీపీ ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు నారాయణ, ఇన్స్పెక్టర్ లు కరుణాకర్ రావు, రమేష్ బాబు, శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ లు మధకర్, శ్రీధర్, విష్ణు, ఆర్ఎస్ఐ లు రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.