YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పాడి పారిశ్రమకు ప్రోత్సాహం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పాడి పారిశ్రమకు ప్రోత్సాహం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పాడి పారిశ్రమకు ప్రోత్సాహం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్
అభివృద్ధి ,సంక్షేమం రెండు సమపాళ్లలో ప్రభుత్వం చేస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగం పాడి ని అదే స్థాయిలో ప్రోత్సహిస్తుందరి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం టిఆర్ఎస్ఎల్పీ లో అయన మాట్లాడారు.  మహిళలే ముల్కనూరు డైలీ మొత్తాన్ని నడిపిస్తున్నారు. గతంలో  సహాకార డైరీ లను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసాయి. విజయ డైరి అవుట్ లెట్  లను168  నుంచి 400 అవుట్ లెట్ లకు పెంచాం...దీన్ని వెయ్యి అవుట్ లెట్ లకు పెంచుతాం. విజయ డైరి నెయ్యి  ముంబై లాంటి నగరాలలో ఫేమస్ అని అన్నారు. విజయ డైరీ కి లక్ష మంది రైతులు పాలు పోస్తున్నారు. సహాకార డైరీలకు ఇంన్సెంటీవ్ ఇవ్వడం ద్వారా మాకు పాలు పోసే వారి సంఖ్య పెరిగింది.  ఓకటి రెండు రోజుల్లో సహాకార డైరి లకు చెల్లించాల్సిన బకాయిలలో  39 కోట్లు విడుదల చేస్తున్నాం. మిగిలిన బకాయిలు త్వరలో చెల్లిస్తాం. పాల ను మాత్రమే కాకుండ ఐస్ క్రీం ,బటర్ మిల్క్ ,నెయ్యి ఇతర పాల పదార్థాలను విజయ  డైరీ ఉత్పత్తి చేస్తుంది. కార్పోరేట్ సంస్థ లతో పాటు విజయ  డైరి పోటీ పడుతుంది. జన సందర్శన ఎక్కువ గా ఉండే అన్ని ప్రాంతాల్లో  విజయ అవుట్ లెట్ లు ఏర్పాటు చేస్తున్నాం. విజయ డైరి తో పాటు కరీంనగర్ , ముల్కనూరు ,మదర్ డైరి లకు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నాం. సహాకార డైరి లకు  సబ్సిడీ తో బర్రెలను అందజేయబోతున్నామని అన్నారు. 
రెండో దశ గొర్రెల పంపిణీ లో భాగంగా 3 లక్షల గొర్రెలను కొనేందుకు 3 వేల కోట్ల రూపాయల ను ఈ బడ్జెట్  ప్రభుత్వం  ప్రతిపాదించింది. గ్రామీణాభివృద్ధి కి ఊతం ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు చేసినా...ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తే..వాల్ల కర్మ. కళ్ళు ఉండి చూడని కబోదులు. ప్రతిపక్ష నేతలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు చాలా బాగా చేస్తున్నారు అంటూనే..వాళ్ళ పార్టీ మీటింగ్ లలో విమర్శిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి 5 లక్షల లీటర్ల పాలు అవసరం...ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటుంన్నాం. సహాకార సంస్థ లకు ప్రోత్సాహాకం ఇస్తూనే...శంషాబాద్ ఏరియా లో మెగా డైరి ని ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్ లో 150 చేపల మార్కెట్ లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 
గొర్ల పంపిణీ లో కొన్ని మిస్ యూస్ అయ్యాయి..అధికారుల లపై కేసు లు నమదుచేసాం. రెండు ఎమ్మెల్సీ స్థానాలు మేము గెలవబోతున్నాం. సీఎం నిలబడ్డా గెలుస్తామన్నోళ్ళు పరిస్థితి ఏంటి. నీటి బుడగ లా  ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇప్పుడు ఏం చెపుతారు. చిన్నారెడ్డి ఎమ్మెల్సీ క్యాండెట్ కాగానే ఉధ్యోగాలు గుర్తుకువచ్చాయా..అధికారంలో ఉన్నప్పుడు చిన్నారెడ్డి ఏం చేసాడు. ఏ ప్రభుత్వం అయినా ఇంటింటికి ఉధ్యోగం ఇవ్వగలదా అని మంత్రి ప్రశ్నించారు. 

Related Posts