కరోనా వ్యాక్సినేషన్ పై మంత్రి ఆళ్ల నాని సమీక్ష
అమరావతి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరగడానికి చర్యలు, కరోనా వ్యాక్సినేషన్ వేగ వంతం, డాక్టర్స్ పోస్టులు భర్తీ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ , ప్రిన్సిపల్ సెక్రటరీ( కొవిడ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈవో డాక్టర్ మల్లికార్జున, ప్రజా ఆరోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్ గీతా ప్రసాదిని , ఎపివివిపి కమీషనర్ డాక్టర్ రామకృష్ణ, డిఎంఇ డాక్టర్ రాఘవేంద్ర రావు పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రములో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు జరగాలి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు సంఖ్య పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిరు నిర్ణయించారు. వ్యాక్సినేషన్ ఉదృతంగా చేపట్టడానికి గ్రామ సచివాలయాలు యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అదేశాలు ఇచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారికి సత్వరమే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. 45 సంవత్సరాల పైబడి, ధీర్గకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికీ వ్యాక్సిన్ వెంటనే చేయడానికి ఏర్పాట్లు చేయాలి. వ్యాక్సినేషన్ పై సమగ్ర కార్యాచరణతో సిద్ధం కావాలని అధికారులకు మంత్రి ఆళ్ల నాని అదేశించారు. పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం పరీక్షలు జరగడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించడం కన్నా.. ఆ వైరస్ నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రములో ఈ నెల 18వ తేది వరకు 13లక్షల 80వేల 537మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు హెల్త్ కేర్ వర్కర్స్ కి మొదటి డోస్ 3లక్షల 22వేల 102మందికి, రెండోవ డోస్ ఒక లక్ష 88వేల 407మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొదటి డోస్ 3లక్షల 40వేల 620మందికి, రెండొవ డోస్ 68వేల 345మందివ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. 60సంవత్సరాల వయసు కలిగిన వారు 2లక్షల 81వేల 187మంది, 45సంవత్సరాలనుండి 59సంవత్సరాల వరకు 98వేల 550మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపారు.