YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ

రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ

రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ
హైదరాబాద్, మార్చి 19,
హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్ట టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం వరకు నల్గొండ స్థానంలో ఏడు, హైదరాబాద్‌ స్థానంలో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ‘హైదరాబాద్‌’ స్థానంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. శుక్రవారం ఉదయం ఐదో రౌండ్ ఫలితాలు వెల్లడైన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఈ స్థానంలో 5 రౌండ్లలో కలిపిప 2,80,030 ఓట్లను లెక్కించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక ప్రకటించారు. ఇందులో 16,712 ఓట్లు చెల్లలేదు. ఐదు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 81,749 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 4,655 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో రౌండ్‌కు 6 గంటల సమయం పడుతోందని, ఆ ప్రకారం చూసినా మొదటి ప్రాధాన్య ఓటు లెక్కింపు శుక్రవారం రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడే సూచనలు కనిపిస్తున్నారు.‘నల్గొండ’లో వెలువడిన ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840 ఓట్లు రాగా, మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లను చెల్లినివిగా గుర్తించారు. మొదటి ప్రాధాన్య ఓటులో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. తుది ఫలితాలు శనివారం వెలువడే అవకాశముంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు.

Related Posts