గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్వతీపురంలో రూ.5కోట్లతో నిర్మించిన గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఐటిడిఎ యూత్ ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో గురువారం నాడు లోకేశ్ సమావేశమై ముఖాముఖీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయకృష్ణ, జడ్పీ ఛైర్ పర్సన్ స్వాతి రాణి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఐటిడిఎ పిఒ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మార్చి నాటికి మరో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. 1985లో ఐటిడిఎ ను దివంగత ఎన్టీఆర్ ప్రారంభించారు. చంద్రబాబు ఐఏఎస్ అధికారులను నియమించారు. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, అభివృద్ధి లక్ష్యం. ఇందులో భాగంగా వందల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధి జరిగిందో లేదో యువతే చెప్పాలి. భయపడొద్దని అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో విశాఖపట్నం ని ఐటీ ఆంధ్రగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం లో కూడా ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ కంపెనీలు వొస్తున్నాయి. మార్చినటికి మరో 25వెలమందికి ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు.