YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

7 లక్షల ట్యాక్స్ పై సెటైర్లు

7 లక్షల ట్యాక్స్ పై సెటైర్లు

7 లక్షల ట్యాక్స్ పై సెటైర్లు
విజయవాడ, మార్చి 19, 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇన్‌కమ్ ట్యాక్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సీఎం ఐటీకి సంబంధించి ప్రభుత్వం రూ.7లక్షలు విడుదల చేసిన జీవో వైరల్ అవుతోంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేగోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ జీవోపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘రూపాయి ఆదాయం కి 'ఏడు లచ్చలు' ఇంకమ్ టాక్స్ కట్టడం రెడ్డి గారికే చెల్లింది. రూపాయి కదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు మీ జీతం.. అంతే అయివుంటుంది లెండి’అని సెటైర్లు పేలుస్తూ ట్వీట్ చేశారు. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా జీవోను వైరల్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.7,14,924ను మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణాశాఖ మంత్రి పేర్ని నానిఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా కలిపి మొత్తం రూ.10,06,020 మంజూరు చేస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవోను టీడీపీతో పాటూ ఇతర పార్టీలు టార్గెట్ చేశాయి.

Related Posts