YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కేబినెట్ లోకి మళ్లీ నవజోత్ సింగ్ సిద్ధూ

 కేబినెట్ లోకి మళ్లీ నవజోత్ సింగ్ సిద్ధూ

 కేబినెట్ లోకి మళ్లీ సిద్ధూ
ఛండీఘడ్,మార్చి 19, 
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు కారణంగా దాదాపు రెండేళ్ల కిందట మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, సిద్ధూ తిరిగి క్యాబినెట్‌లో చేరుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధూ క్యాబినెట్‌లో తిరిగి చేరుతారనే ప్రచారం జోరందుకున్న వేళ.. అమరీందర్‌తో ఆయన భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌లో అమరీందర్, సిద్ధూ గురువారం సమావేశమై మంత్రివర్గంలో చేరే అంశంపై ఇరువురూ చర్చించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. తమ బృందంలో సిద్ధూ చేరాలని అందరూ కోరుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు. అమరీందర్, సిద్ధూ 40 నిమిషాల పాటు సమావేశం జరగ్గా.. మాజీ క్రికెటర్ క్యాబినెట్‌లోకి చేరుతారనే చర్చ జోరుగా సాగుతోంది. మా భేటీ స్నేహపూర్వకంగా సాగిందని, తనతో కలిసి సిద్ధూ టీ తాగారని అమరీందర్ తెలిపారు.‘సిద్ధూ తనకు సమయం కావాలన్నారు.. అయన తగినంత సమయం తీసుకోనివ్వండి.. తిరిగి క్యాబినెట్‌లోకి వస్తారు.. మా బృందంలోకి తప్పకుండా వస్తారు’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఒకవేళ సిద్ధూ డిప్యూటీ సీఎం లేదా పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది అని కెప్టెన్ బదులిచ్చారు.ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేను, పీసీసీ చీఫ్ సునీల్ జాఖర్ కాదు.. ఆయన ఏం కావాలనుకుంటున్నారో కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయిస్తారు.. ఒకవేళ ఆయన సీఎం పదవి కోరుకుంటే అదే దక్కుతుంది’ అని వ్యాఖ్యానించారు. సిద్ధూ తనకు రెండేళ్ల వయసు నుంచే తెలుసని అమరీందర్ పేర్కొన్నారు. ఇరువురు భేటీకి సంబంధించిన ఫోటోలను సీఎం మీడియా సలహాదారు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.సిద్ధూ తిరిగి క్యాబినెట్‌లోకి చేరుతారని, కీలక బాధ్యతలను అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో సీఎం అమరీందర్‌తో ఆయన భేటీ కావడం దీనికి బలం చేకూరింది. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సిద్ధూపై అమరీందర్ ఆరోపణలు చేశారు. ఆయన సరిగ్గా ప్రచారం నిర్వహించకపోవడం సహా తన మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో సమర్థంగా నిర్వహించలేకపోయారని ఆరోపించారు.తర్వాత మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టి సిద్ధూ నిర్వహిస్తున్న శాఖల్లో ముఖ్యమైన స్థానిక సంస్థలు, పర్యాటక, సాంస్కృతిక శాఖను తొలగించి విద్యుత్, నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖలను అప్పగించారు. దీంతో అమరీందర్ కేబినెట్ నుంచి సిద్ధూ తప్పుకున్నారు.

Related Posts