తిరుపతి నగర మేయర్ గా ఆర్. శిరీషా , డిప్యూటీ మేయర్ గా ఎం. నారాయణ
తిరుపతి, మార్చ్ 18
ఈ నెల 10న నగర పాలక సంస్థ ఎన్నికలు , 14న కౌంటింగ్ తో, ఏకగ్రీవాలతో కలిపి 50 వార్డులకు గాను, 49 వార్డులకు కార్పొరేటర్లు ఎన్నుకోబడ్డారని, ఎస్. ఈ. సి. ఒక వార్డును సస్పెన్షన్ లో ఉంచిందని, నేడు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ ను నియమించడం జరిగిందని, కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. తిరుపతి నగర పాలక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహణ కార్యక్రమం గురువారం నగర పాలక సంస్థ ఆవరణలోని లలిత కళా ప్రాంగణం లో నగర పాలక కమీషనర్ పి.ఎస్.గిరీషా ఆధ్వర్యలో ఏర్పాటు చేయగా, ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ నవీన్ కుమార్ , ఎక్స్ అఫిషియో మెంబర్ గా స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారు. ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియ వివరించి అక్షర క్రమం లో ఎన్నికైన 49 మంది సభ్యులను ఒక్కొక్కరుగా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరిలో 48 మంది వై.ఎస్.ఆర్.సి.పి. నుండి , ఒకరు టి. డి. పి. నుండి ఎన్నిక కాబడ్డ వారు వున్నారు. అనంతరం మేయర్ గా శ్రీమతి ఆర్. శిరీషా ను కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ప్రతిపాదించగా, మోహన కృష్ణ యాదవ్ బలపరిచారు, డిప్యూటీ మేయర్ గా ఎం. నారాయణను భూమన అభినయ రెడ్డి ప్రతిపాధించగా నరేంద్రనాద్ బలపరాచారు, మిగిలిన సభ్యుల సమ్మతితో ఎన్నిక పూర్తి అయిందని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లకు, ఎన్నికల పరిశీలకులకు, నగర పాలక సంస్థ కమిషనర్ , అధికారులకు, మీడియాకు ప్రిసైడింగ్ అధికారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికకైన సభ్యులు, వారి కుటుంబీకులు, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ హరిత, ఉప కమీషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటి జి .ఎం. చంద్ర మౌళి , అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.