హైద్రాబాద్, మార్చి 20,
భూపరిపాలనలో తెలంగాణ నూతన అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు పట్టదారు పాసుపుస్తకాల చట్టం 2020’ను అమలులోకి తీసుకొచ్చింది. ఆ యజమాన్య హక్కులకు సంబంధించిన చట్టాలు, రికార్డులు గతంలో లోపభూయిష్టంగా ఉండటం వల్ల భూవివాదాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఈ పరిస్థితి మారకుండా పల్లెలు ప్రశాంతంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు జరగుతుండడంతో భూపరిపాలనలో నూతన శకానికి నాంది పలికింది.ఈ పోర్టల్ సాయంతో ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా, ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకునేలా ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇప్పటి వరకు ధరణి వెబ్‌సైట్‌ను 2 కోట్ల 17 లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగింది. ఈ ప్రక్రియ చాలా సులభతరం కావడంతో అందులో పారదర్శకత పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ అంతా చకచకా జరుగుతోంది. ఇప్పటి వరకు 3 లక్షల 29 వేల లావాదేవీలు జరగ్గా 1 లక్షా 6 వేల పెండింగ్ మ్యూటేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారుల విచక్షణాధికారాన్ని ప్రభుత్వం తొలగించింది.ఈ నేపథ్యంలోనే పక్కాగా భూరికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆదారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్ బుక్కులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణ (ట్యాంపరింగ్)కు ఎంత మాత్రం అవకాశం ఉండదు. వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా, దేవాలయ భూముల, వక్స్ భూముల, అటవీ భూముల ఇతర ప్రభుత్వ భూముల పరిష్కారమవుతాయి హద్దుల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ బడ్జెట్ లో సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెచ్చింది. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల దాకా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు దేశం లో ఇంకే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదుఅసహాయులకు జీవన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తోంది.