YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బ్యాంకుల్లో ఆధార్ సేవలు

బ్యాంకుల్లో ఆధార్ సేవలు

ప్రతి పనికి .ఆధార్ నెంబర్ కీలకంగా మారుతున్న సందర్భంలో. బ్యాంకుల్లో తాజాగా ఏర్పాటు చేసిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో ఆధార్‌కు సంబంధించిన సేవలన్నీ అందుబాటులో ఉంచారు. అడ్రస్‌ఫ్రూఫ్, ఐడీఫ్రూఫ్ తీసుకొని వస్తే ఆధార్‌కార్డ్ ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో ఖాతాలున్నా లేకపోయినా ఏ వ్యక్తి అయినా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్న బ్యాంకు బ్రాంచ్‌ని సంప్రదించి ఆధార్ నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడం, పేర్లు, చిరునామా, పుట్టినతేదీ, ఫొటోల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడం, ప్రతి ఆధార్‌నెంబర్‌కు ఫోన్‌నెంబర్, ఈ మెయిల్ అడ్రస్‌ను అనుసంధానం చేసుకోవడం, వయస్సు పైబడి, లేక వివిధ కారణాల వల్ల ఆధార్‌లోని వేలి ముద్రలు, ఐరిష్ సరిగా పనిచేయని వారికి అదేవిధంగా 12 ఏండ్లు నిండిన చిన్నారులకు వేలు ముద్రలు, బయోమెట్రిక్, ఐరిష్ అప్‌డేట్ చేయడం తదితర అన్ని రకాల సేవలను ఒకేచోట అందిస్తున్నారు.ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఆధార్ కార్డులను జారీ చేస్తున్నది. అయితే ఆధార్ నెంబర్ ఉన్నప్పటికీ వివరాల్లో తప్పుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తప్పులను సవరించుకునేందుకు గతంలో ఈ సేవ, ఆన్‌లైన్ సెంటర్‌లలో ప్రత్యేక సేవలు కొనసాగాయి. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్ సేవలను బ్యాంకులకు పరిమితం చేశారు. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆధార్ సేవల కోసం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1129, రంగారెడ్డి జిల్లా పరిధిలో 560, మేడ్చల్ జిల్లా పరిధిలో 483 బ్యాంకులున్నాయి. ప్రతి బ్యాంకు తమ బ్రాంచ్‌ల మొత్తం సంఖ్యలో కనీసంగా 10 శాతం బ్రాంచ్‌లలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు హైదరాబాద్ జిల్లాలో 75, మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 50 బ్రాంచ్‌లలో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

Related Posts