అదిలాబాద్, మార్చి 20,
ద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర సర్కారు, అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ‘ప్రైవేట్’లో టెస్టుల పేరిట చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు జిల్లాకో టీ-డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ సెంటర్‌లో వైద్యపరీక్షల కోసం అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉం చారు. ఈ కేంద్రంలో బయోకెమిస్ట్రీ, పాథలాజికల్, మైక్రో బయోలజీకి సంబంధించిన 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారు. సాధారణ రక్త, మల, మూత్ర పరీక్షలతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల నిర్ధారణ, మూత్రపిండాలు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, షుగర్, బీపీ వంటి తదితర పరీక్షలను చేయనున్నారు. 25 రోజులుగా ట్రయల్ రన్ చేస్తుండగా, ప్రస్తుతం 25 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పీహెచ్‌సీల నుంచి ఇప్పటికే నమూనాలు సేకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కేంద్రంలో 24 గంటలపాటు సేవలందించనున్నారు. అర్హులైన ఎనిమిది మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించారు. వీరు పీహెచ్‌సీల నుంచి వచ్చి శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ కేంద్రంలో కిడ్నీ, లివర్ పనితీరు, థైరాయిడ్, సీబీ పీ, సీరం, ఐజీజీ, ఐజీఎం వంటి ఖరీదైన వైద్య పరీక్షలతోపాటు 52 రకాల టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని 22 పీహెచ్‌సీల్లో ల్యాబ్‌లు, టెక్నీషియన్లు ఉన్నారు. పీ హెచ్‌సీల్లో అన్ని రకాల వైద్యపరీక్షలు అందుబాటులోకి లేకపోవడంతో దవాఖానలకు వచ్చేవారు పట్టణ ప్రాంతాలకు వచ్చి ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు పరీక్ష కేంద్రాల నిర్వాహకుల అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు.ఆదిలాబాద్ రిమ్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో రోజు 200 వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ట్రయల్న్‌ల్రో భాగంగా జిల్లాలో 14 పీహెచ్‌సీల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. వివిధ రూట్ల నుంచి న మునాలను సాయంత్రం 4 గంటలకు డయాగ్నోస్టిక్ కేంద్రానికి చేరుకుంటున్నాయి. సెంటర్‌లోని ల్యాబ్ టెక్నీషియన్లు నమూనాలను పరిశీలించి రాత్రి 8 గంటలకు నివేదికలు త యారు చేస్తారు. ఆయా పీహెచ్‌సీల నుంచి వచ్చి శాంపిళ్ల రిపోర్టులు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. నివేదికల ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నా, నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఫలితంగా పేదలు ప్రైవేట్ నిర్ధారణ కేంద్రాల్లో అడ్డగోలు ఫీజులు చెల్లించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యాధి నిర్ధారణ కేంద్రాలకు దీటుగా అ త్యాధునిక వైద్య పరికరాలతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెం టర్లను ఏర్పాటు చేస్తున్నది. త్వరలోనే వీటి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండగా, ప్రైవేట్‌లో టెస్టుల పే రిట జరిగే దోపిడీకి చెక్ పడనున్నది. ఈ సెంటర్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరంలా మారనున్నది. రోగాలబారిన పడే ప్రజలకు ఎంతో మేలు చేయనున్నది.కేంద్రంలో జరిగే ప్రతి పరీక్షలను రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తారు. ఇందుకు బయోకెమిస్ట్రీ, పాథలాజిస్టు, మైక్రో బయోలజిస్ట్‌లైన వైద్య నిపుణులు హైదరాబాద్ కేంద్రంగా ప్రతి రిపోర్ట్‌ను పరిశీలిస్తారు. వీటిని తిరిగి స్థానిక నిర్ధారణ పరీక్షల కేంద్రానికి నివేదిస్తారు. రోగుల మొ బైల్ ఫోన్ లేదా మెయిల్‌కు అటాచ్ చేస్తారు. మాన్యువల్ రి పోర్టులు అవసరమున్న రోగులు తాము రక్త, మూత్ర న మూనాలు ఇచ్చిన కేంద్రాలకు వెళ్లి తీసుకునే సదుపాయం కల్పించారు