YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు

హైద్రాబాద్ నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నారు. సమ్మర్ కోసం అవసరమైతే ఎమర్జెన్సీ పంపింగ్ అవసరమని అంచనాతో అందుకు అనుగుణంగా అధి కారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నిత్యం 900 క్యూసెక్కుల నీటిని తరలించే 10 ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు సిద్ధం చేశారు. ఇందుకోసం రూ.3.7 కోట్ల మేర ఖర్చుతో అత్యవసర పంపింగ్‌నకు ట్రాన్స్‌మిషన్ విభా గం అన్నీ ఏర్పాట్లు చేసింది. ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కృష్ణా జలాల తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టి ప్రజలకు వేసవిలో నీటి కష్టాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. నీటి నిల్వలు ప్రమాదకరస్థాయికి చేరినా అత్యవసర పంపింగ్ ద్వారా రోజూ 270 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్ ఫర్ డే) నీటిని తరలిం చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. 

నాగార్జున సాగర్‌లో శరవేగంగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో  అధికారుల చూపులన్నీ ఒక్కసారిగా సాగర్ వైపు మళ్లాయి. ఎమర్జెన్సీ పంపింగ్ ప్రక్రియను పరిశీలిస్తే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి ఛానల్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ జలాశయంలోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ నుంచి నీటిని సేకరించి కోదండపూర్ రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడి శుద్ధి చేసిన ఈ నీటిని మూడు దశల్లో నగరానికి రోజూ 270 ఎంజీడీలను తరలించనున్నారు. ఈ క్రమంలోనే అత్యవసర పంపింగ్ ద్వారా పుట్టంగండిని నీటిని తరలించి, అక్కడి నుంచి కోదండపూర్, ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నగరానికి తరలించే విధానంలో ఎలాంటి ఇబ్బందులు ల్లేకుండా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సాగర్ నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 900 క్యూసెక్కుల సామర్థ్యంతో 10 ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్ల ద్వారా నిత్యం 270 ఎంజీడీల నీటిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కృష్ణా జలాల తరలింపులో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు. గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 513 అడుగులకు నీటి నిల్వలకు చేరాయి. ఐతే వాస్తవంగా 506 అడుగులు చేరిన వెంటనే అత్యవసర పంపింగ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియను చేపడతారు. 

Related Posts