విజయవాడ, మార్చా 20,
ఎన్నికల్లో జయాపజయాలు అన్నవి అత్యంత సహజం. ఆ సంగతి దశాబ్దానికి పైగా విశేష అనుభవం ఉన్న జగన్ కి తెలియనిది కాదు అని ఎవరూ అనుకోరు. పైగా జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని భారీ ఓటమితోనే కొనసాగించారు. 2014 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోవడం అన్నది ఎవరూ జీర్ణించుకోలేని విషయమే. మరి అదే డిప్రెషన్ లో జగన్ ఉంటే 2019లో పార్టీని విజయపధంలో నడిపించగలిగేవారా. అందువల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో తేడా పాడా వచ్చినా జగన్ అటు ప్రభుత్వంలో, పార్టీలో మార్పు చేర్పులు చేసుకుంటారు అని అంటున్నారు.ఇక పోతే జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారు అంటూ తరచూ టీడీపీ అనుకూల మీడియా కధనాలు వండి వారుస్తోంది. ఆ మధ్యన పంచాయతీ ఎన్నికలు జరిపించాలి అని సుప్రీం కోర్టు ఆదేశం రావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు జరపను అని పట్టుపట్టిన జగన్ నేరుగా అసెంబ్లీ రద్దు వైపు మొగ్గు చూపారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. అక్కడికీ ఆయన జగన్ ఆఫీస్ లో ఎక్కడో ఉండి అన్నీ చూసేసినట్లు, పూర్తిగా వినేసినట్లుగా మీడియా ముందు పెద్ద నోరు చేశారు. కానీ జగన్ సన్నిహితులు మాత్రం అలాంటిది ఏదీ లేదని స్పష్టం చేశారు.లోకల్ బాడీస్ లో జగన్ కోరినట్లుగా ఫలితాలు రాకపోతే అసెంబ్లీని రద్దు చేస్తారంటూ ఇపుడు అనుకూల మీడియ మరో కధనం వండింది. అది కూడా విశాఖ వంటి ప్రతిష్తాత్మకమైన మేయర్ సీటు విషయంలోనట. విశాఖను పరిపాలనారాజధానిగా చేసినా కూడా గెలవకపోతే అసెంబ్లీ రద్దు అని జగన్ మంత్రులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఆ మీడియా కధనాన్ని అల్లింది. అసలు ఇది ఎలా ఉంది అంటే బోడి గుండుకూ మోకాలుకూ మధ్య లింక్ పెట్టినట్లుగా అని వైసీపీ నేతలే అంటున్నారు. జగన్ కి ఫుల్ మెజారిటీ ఉంది. పైగా మూడేళ్ళకు పైగా అధికారం ఉంది. పొలిటికల్ గా కన్ఫర్టబుల్ పొజిషన్ కూడా ఉంది. ఇన్ని ఉన్న వేళ ఎవరైనా పదవిని కాలదన్నుకుంటారా. ఇదే చర్చ వైసీపీలో కూడా సాగుతోంది.ఎవరెన్ని చెప్పినా మా తీరు మారదు అని టీడీపీ పెద్దలతో పాటు ఎల్లో మీడియా కూడా పాత పాటనే పాడుతోంది. జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారు. ఈ ప్రభుత్వం అయిదేళ్ళూ ఉండదు, జమిలి ఎన్నికలు వస్తాయి. ఇలా రెండేళ్ల వ్యవధిలో ఎన్నో రాతలు రాసి ఆత్మ తృప్తి పొందుతున్నారు తప్ప అసలేమీ అక్కడ జరగడంలేదు. అర్జంటుగా ఎన్నికలు ఏపీలో వచ్చేయాలి. ఏదోలా హడావుడి చేసి చంద్రబాబు మళ్లీ సీఎం అయిపోవాలి. చూస్తూంటే బాబు కంటే కూడా అనుకూల మీడియాకే అతృత ఎక్కువగా ఉన్నట్లుంది. అయినా వారి ఆశలు తీరే సీన్ మాత్రం ఇప్పటికైతే ఏపీలో లేదనే చెప్పాలి. అయినా ఇవే రాతలు మరో మూడేళ్ళ పాటు రాస్తూనే ఉంటారు. అందులో డౌట్ ఎవరికైనా ఉందా.