YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కల్పలత గ్రాండ్ విక్టరీ వెనుక

కల్పలత గ్రాండ్ విక్టరీ వెనుక

గుంటూరు, మార్చి 20, 
ష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత రెడ్డి గెలుపొందారు. ఈ విష‌యం పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. వాస్తవానికి ఈ ఎన్నిక‌ల్లో పోటీ బొడ్డు నాగేశ్వర‌రావుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏఎస్‌. రామ‌కృష్ణకు మ‌ధ్య ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అంచ‌నాలు త‌ల్లకిందులు చేస్తూ క‌ల్పల‌త ఘ‌న‌విజ‌యం సాధించారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అస‌లు ఆమె పేరే పెద్దగా వినిపించ‌లేదు. అలాంటిది కల్పలత అనూహ్య విజ‌యం ఎలా సాధ్య‌మైంద‌న్నది ఆస‌క్తిక‌ర‌మే. ప‌రోక్షంగా క‌ల్పల‌త‌కు వైసీపీ ప్రజా ప్రతినిధులు రెండు జిల్లాల్లో బాగా స‌హ‌క‌రించారు అన్నది వాస్తవం. అందుకోసం వారు ప‌లు ఉపాధ్యాయ సంఘాల‌పై తీవ్రమైన ఒత్తిడి చేశారు.కల్పలత ఈ ప్రాంతానికి పూర్తిగా నాన్ లోక‌ల్‌. ఈ విజ‌యంలో చాలా స్పెషాలిటీ ఉంద‌నే చెప్పాలి. రాజ‌కీయ చైత‌న్యానికి మారు పేరుగా ఉన్న ఈ రెండు జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఇప్పటి వ‌ర‌కు విద్యావేత్తలే ఎక్కువుగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. బొడ్డు నాగేశ్వర‌రావు, ఏఎస్‌. రామ‌కృష్ణ, ల‌క్ష్మణ్‌రావు లాంటి విద్యావేత్తలు విజ‌యాలు సాధిస్తున్నారు. అయితే అనంత‌పురం జిల్లాలోని క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన క‌ల్పల‌త ఈ సారి ఇక్కడ పోటీ చేసిన మ‌హామ‌హుల‌ను ఓడించి మ‌రీ విజ‌యం సాధించారు. క‌ల్పల‌తా రెడ్డిది రాజ‌కీయ కుటుంబం. ఆమె ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్ట‌ర్ ప్రతాప్‌రెడ్డి స‌తీమణి.క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలోని త‌లుపుల మండ‌లం బండ్లప‌ల్లె వీరి స్వస్థలం. క‌ల్పల‌త తండ్రి గ‌తంలో టీడీపీ హ‌యాంలో జ‌డ్పీ వైస్ చైర్మన్‌గా కూడా ప‌నిచేశారు. జ‌గ‌న్‌తో ద‌గ్గర సంబంధాలు ఉన్నాయి. ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందే క‌దిరి వైసీపీ టిక్కెట్ కూడా ఆశించారు. జ‌గ‌న్ సైతం ఒకానొక ద‌శ‌లో ఇవ్వాల‌ని అనుకున్నారు కూడా. అయితే అప్పుడు అనంత‌పురం జిల్లా పార్టీ వ్యవ‌హారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వైపు మొగ్గు చూప‌డంతో క‌ల్పల‌త ఆశలు నెర‌వేర‌లేదు.ఇక ఇప్పుడు వైసీపీ మ‌ద్దతుతోనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆమె టీచ‌ర్ కూడా కాదు… అయినా ఉపాధ్యాయ సంఘాలు, అధికార పార్టీ మ‌ద్దతుతో కల్పలత ఎమ్మెల్సీగా ఘ‌న‌విజ‌యం సాధించారు. ఆమె ఏకంగా యూటీఎఫ్ నుంచి పోటీ చేసిన‌ బొడ్డు నాగేశ్వర‌రావు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏఎస్ రామ‌కృష్ణ , ఎస్టీయూ నుంచి పి.మ‌ల్లిఖార్జున‌రావు ముగ్గురిని ఢీ కొట్టి మ‌రీ గెలిచారు. గెలుపు గెలుపే అయినా ఆమె విజ‌యం వెన‌క ధ‌న‌ప్రవాహం కూడా బాగా ప‌నిచేసింద‌ని భోగ‌ట్టా ?

Related Posts